Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ 169వ చిత్రంపై స్పష్టత వచ్చింది. రజనీకాంత్- నెల్సన్ కాంబినేషన్‌లో సినిమాని రూపొందిస్తున్నట్లు సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో నెల్సన్, రజనీకాంత్, సంగీత దర్శకుడు అనిరుధ్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు సన్ పిక్చర్స్ పేర్కొంది.

కానీ, రజిని గత స్టార్ డమ్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే.. ఒకప్పుడు కలెక్షన్ల ప్రవాహం ఉండేది. ఆ ప్రవాహంలో స్టార్ హీరోల సినిమాలు కూడా కొట్టుకుపోయేవి. కానీ ప్రస్తుతం అదంతా గతంగా మిగిలిపోయింది. రజినీ సినిమాకి పోటీగా చిన్నాచితకా హీరోలు కూడా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
మరోపక్క బాక్సాఫీస్ దగ్గర మోత మోగించాల్సిన రజినీ మాత్రం కనీస కలెక్షన్స్ కూడా రాబట్టలేక చేతులేత్తేస్తున్నాడు. రజినీకాంత్ సినిమాలను ఆడియన్స్ సీరియస్ గా తీసుకోవడం లేదు. రజినీ గత సినిమా ‘అన్నాత్తే’కి దారుణంగా కలెక్షన్స్ వచ్చాయి. తెలుగులో పెద్దన్నగా వచ్చిన ఈ సినిమా విషయంలో నిర్మాతలు భారీగా నష్టపోయారు.
Also Read: ఏపీలో కొత్తగా పెరిగిన టికెట్ల రేట్లు ఇలా ఉన్నాయి..!
గత దీపావళీ పండగ కానుగగా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ సినిమాకి తమిళంలో కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు అంటేనే.. బాక్సాఫీస్ వద్ద రజిని పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడానికి కూడా చాలా కష్ట పడాల్సి వచ్చింది. అన్నట్టు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా సాధించ లేదు.

మరీ ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్- నెల్సన్ కాంబినేషన్‌లో ఓ సినిమాని రూపొందిస్తున్నట్లు సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించి.. సాహసం చేసింది. పైగా ఓ వీడియోను కూడా విడుదల చేసి.. సూపర్ స్టార్ రజనీకాంత్ 169వ చిత్రం మాదే అని గర్వంగా ప్రకటించింది. మరీ ఈ క్రేజీ ప్రాజెక్టుకు లాభాలు వస్తాయా? లేక గత సినిమాల లాగే నష్టాల మయం అవుతుందా ? చూడాలి.
Also Read: ఇండియన్ కోస్ట్ గార్డ్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. పది అర్హతతో?