Movie Trends : మూవీ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పై నెటిజన్లు తాజాగా ఫైర్ అవుతూ ట్రోల్ చేస్తున్నారు. కారణం.. ఐశ్వర్యరాయ్ లతా మంగేష్కర్ మరణం పై లతా మంగేష్కర్ మరణ వార్త పై లేటుగా స్పందిస్తావా? అని తిట్టిపోస్తున్నారు. లతాజీ ఆదివారం మరణిస్తే ఇంత ఆలస్యం(మంగళవారం)గా స్పందిస్తావా? ఇప్పుడు నిద్రలేచావా? ఈవార్త ఇప్పుడే తెలిసిందా? అని మండిపడుతున్నారు. అయితే ఐస్ ఫ్యాన్స్ మాత్రం ఆమెను వెనకేసుకొస్తున్నారు. తను ఎక్కువగా ఫోన్ వాడదని, అందువల్లే లేట్‌గా పోస్ట్ పెట్టి ఉండొచ్చని కామెంట్ చేస్తున్నారు.

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన 7 Days 6 Nights సినిమా ట్రైలర్ విడుదలైంది. డర్టీ హరి మూవీతో డైరెక్టర్‌గా మారిన ప్రముఖ నిర్మాత MS రాజు దీనికి దర్శకత్వం వహించాడు. ఇందులో మెహర్ చాహల్ హీరోయిన్‌గా నటించింది. రోహన్, కృతిక శెట్టి కీలక పాత్రల్లో నటించారు. త్వరలోనే సినిమాను విడదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.
Also Read: ‘చిరంజీవి’ని ఇరికించొద్దు, ‘చిరంజీవి’ని తిట్టొద్దు !
ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. రేపు సీఎం జగన్‌ను సినీ పరిశ్రమ ప్రముఖులు కలవనున్నారు. చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సినిమా టికెట్ల ధరపై సీఎంతో చర్చించనున్నారు.

కాగా ఇప్పటికే టికెట్ల ధర పెంపుపై నియమించిన కమిటీ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి నివేదించింది. కమిటీ ప్రతిపాదనలపై సినీ పెద్దలతో చర్చించి ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యమంత్రి జగన్ సినీ ప్రముఖులతో భేటీ అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read: ‘కరీంనగర్’ రివ్యూ: వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి?