Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత థియేటర్లు మళ్లీ నిండిపోతున్నాయి. ఇదే సమయంలో ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సినిమాలతో పాటు పూర్తి స్థాయి వినోదాన్ని అందించేలా వెబ్ సిరీస్‌లను రూపొందిస్తున్నాయి. అయితే, ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులకు అందించిన జీ5… తాజాగా ‘గాలివాన’ వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది.

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో అబ్బాస్-మస్తాన్ ద్వయం అంటే సూపర్ హిట్ చిత్రాలకు పెట్టింది పేరు. ఖిలాడి, బాజీగర్ నుండి రేస్ చిత్రాల వరకు, సూపర్ క్రేజ్ తెచ్చుకున్న దర్శక ద్వయం. వీళ్ళు రామ్ చరణ్ నటనకే కాదు, బయట చరణ్ సింప్లిసిటీకి కూడా ముగ్థులయ్యారు. ఈక్రమంలోనే చరణ్‌తో ఓ చిత్రం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read: IPL 2022: వరుస ఓటములతో ముంబై ఇండియన్స్… రెండో సారి జరిమానా

అలాగే మరో అప్ డేట్ ఏమిటంటే.. KGF-2 ప్రమెషన్స్‌లో భాగంగా యాంకర్ సుమతో ముచ్చటించిన కన్నడ స్టార్ హీరో యశ్.. NTR తనను డిన్నర్‌కు ఆహ్వానించాడని.. ఆయన కుటుంబం చాలా బాగా రీసివ్ చేసుకుందన్నారు.స్పేషల్‌గా NTR తల్లి శాలిని గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆమెతో మంచి బాండింగ్ కుదిరిందని అన్నాడు. NTR కుటుంబం ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికి మరచిపోలేనని యశ్ అన్నాడు. కాగా యశ్ నటించిన KGF-2 బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.

ఇక లాస్ట్ అప్ డేట్ విషయానికి వస్తే..కరోనా కష్టకాలంఓ సామాన్యులకు, పేదలకు సోనూ సూద్ చేసిన సహాయ కార్యక్రమాల గురించి తెలిసిందే. వలస కార్మికుల్ని ఇంటికి చేర్చడం, పలువురికి ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలతో రియల్ హీరో అయ్యాడు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల కోసం ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కూడా కల్పించాడు. అందుకే యూఏఈ ప్రభుత్వం సోనూకి గోల్డెన్ వీసాని బహుకరించింది. కాగా సోనూ భవిష్యత్తులో అక్కడకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడు.