Waack Girls Review : ప్రైమ్ వీడియో ‘వాక్ గర్ల్స్’ అనే కొత్త సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ సిరీస్ ను పద్మశ్రీ అవార్డు గ్రహీత సుని తారాపోరేవాలా నిర్మించి.. దర్శకత్వం వహించారు. సుని, ఇయానా బటివాలా, రోనీ సేన్ సహ రచయితలుగా ఈ కొత్త సిరీస్ కు వ్యవహరించారు. మేఖోలా బోస్, రితాషా రాథోడ్, అనసూయా చౌదరి, క్రిషన్ పెరీరా, ప్రియమ్ సాహా, రూబీ సాహ్, అచింత్య బోస్‌లతో పాటు ప్రముఖ నటులు బరున్ చందా, లిల్లేట్ దూబే, దివంగత నితీష్ పాండే దీనిలో ప్రధాన పాత్రలు పోషించారు.
మేకర్స్ ఈ షోను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. “కోలకతాలో ఈ స్టోరీ ప్రారంభం అవుతుంది. ఇక్కడ నడక శక్తిని.. భారతదేశంలో పెద్దగా తెలియని డైనమిక్ నృత్య రూపాన్ని ఇది ఆవిష్కరించింది. స్నేహం, తిరుగుబాటుతో కూడిన విభిన్నమైన సమూహం ఇందులో ఒక చోటకు చేరుతారు. ఈ ఆరుగురు విభిన్న శరీరాకృతులు కలిగి ఉన్న వారు.. డ్యాన్స్ మీద ఉన్న ఇష్టంతో ఒక్కటవుతారు. ప్రతి ఒక్కరిలో వారి ప్రత్యేకమైన కథను కలిగి ఉంటారు. వీరందరికీ ఒక నిపుణుడు శిక్షణ అందిస్తుంటారు. నడక అనేది కదలిక, భావోద్వేగాల ప్రయాణం. ఇది ప్రతి ఒక్కరిలో ప్రత్యేకతను బహిర్గతం చేస్తుంది. ఈ విషయాన్ని ఈ సిరీస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ సిరీస్ కోల్‌కతాకు చెందిన మ్యాథ్స్ విద్యార్థిని ఇషాని (మెఖోలా బోస్)ని చుట్టూ తిరుగుతుంది. ఆమె వాకింగ్ పవర్ ఫుల్ డ్యాన్స్ తో గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతుంది. ఆమె మేనేజర్ లోపా (రిటాషా రాథోర్)తో కలిసి ది సిటీ ఆఫ్ జాయ్ మిగతా కొంత మందితో కలిసి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. తొమ్మిది ఎపిసోడ్‌లలో కూడిన ఈ సిరీస్ డ్యాన్స్ ద్వారా ఒకరి గుర్తింపు కోసం సాగే ప్రయత్నంగా కొనసాగుతుంది. అయితే కథనం లోతును పరిచయం చేయడంతో దర్శకులు తడబడినట్లు కనిపిస్తోంది. ఇషాని వ్యక్తిగత జీవితం ఆమె తాత (బరుణ్ చందా), ఒక మాజీ థియేటర్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతుంది. అతను ఈ సిరీస్ లో వైకల్యంతో పోరాడుతుంటారు.
టెస్ (క్రిసాన్ పెరీరా) ఒక తల్లి (లిల్లేట్ దూబే)తో జూదం అలవాటు కారణంగా వారి సంబంధం దెబ్బతింటుంది. మిచ్కే (ప్రియమ్ సాహా) ఆమె గజిబిజి తల్లి, అనుమిత (రూబీ సా) డ్యాన్స్ కలలు కనే జిమ్నాస్ట్‌గా కష్టపడుతుంటారు. మెఖోలా బోస్ ఇషాని పాత్రలో అద్భుతంగా నటించారు. ఆమె పాత్ర జీవితంలో ఆడవాళ్లు జరుపుతున్న పోరాటాలను గుర్తుకు తెస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, ఆమె తాతను చూసుకోవడం వంటి భావోద్వేగాలు బాగా చూపించారు. చివరికి, ఈ సిరీస్ చూస్తున్నంత సేపు హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో పోరాట స్ఫూర్తిని రగిలించేవిగా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని లోపాలు మినహా ఈ సిరీస్ చూడడానికి ఫర్వాలేదనిపించుకుంటుంది.