https://oktelugu.com/

Matka Movie Review: మట్కా ఫుల్ మూవీ రివ్యూ…

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన 'మట్కా' సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించిందనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : November 14, 2024 / 08:21 AM IST

    Matka Movie Review

    Follow us on

    Matka Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు వచ్చిన చాలామంది హీరోలు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కీలకపాత్ర వహిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగొందిన చిరంజీవి సైతం ఇప్పుడు యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ముందుకు సాగడం విశేషం… ఇక ఇదిలా ఉంటే మెగా ప్రిన్స్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న వరుణ్ తేజ్ సైతం తనదైన రీతి లో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన ‘మట్కా’ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించిందనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఒక అణగారిన వర్గానికి చెందిన కుర్రాడిగా ఈ సినిమాలో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇక ఆయనలో తిరుగుబాటు మొదలైతే ఎలా ఉంటుంది అనే పాయింట్ బేస్ చేస్తూ ఈ కథ నడింపించారు. ఇక మట్కా అనే ఇల్లీగల్ బిజినెస్ ని నడిపే ఒక డాన్ గా కూడా హీరో ఎదుగుతాడు. మరి దానికి అనుగుణంగా ఆయనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. తన బిజినెస్ కి ఎవరెవరు అడ్డు వచ్చారు. హీరో వాళ్లకి సమాధానం ఎలా చెప్పాడనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా మార్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక కంటెంట్ ను బేస్ చేసుకొ ని సినిమాను ముందుకు నడిపించడంలో కరుణ కుమార్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. మరి ఆయన ఈ సినిమాని కూడా తన గత చిత్రాల మాదిరిగానే ముందుకు మూవ్ చేశాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకుడిని అలరించినప్పటికి ఇందులో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ప్రతి ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ యాక్టింగ్ కూడా చాలా సెటిల్డ్ గా ఉండడంతో ఈ సినిమా ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ ను అయితే క్రియేట్ చేసింది.

    మరి అలాంటి ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అంత ప్రాపర్ గా సెట్ అవ్వలేదనిపిస్తుంది. ఈ సినిమాను లూప్ స్క్రీన్ ప్లే లో చేసి ఉంటే దాని ఇంపాక్ట్ ఇంకా బాగుండేది. ఇక ఈ సినిమా పెద్ద కథ అయితే కాదని ఇంతకుముందు కేజిఎఫ్, పుష్ప లాంటి సినిమాలు ఎలాగైతే ఇల్లీగల్ బిజినెస్ ని బేస్ చేసుకొని వచ్చాయో అలాంటి కథతోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. అయినప్పటికి ఈ సినిమా ప్రేక్షకుల్లో ఒక హై వోల్టేజ్ ఫీల్ ని కలిగించడమే కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పాలి… ఈ సినిమాకి మ్యూజిక్ జీవీ ప్రకాష్ కుమార్ అందించడం విశేషం… ఇక ఈ సినిమాలో కొన్ని కోర్ ఎమోషన్స్ లో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక వరుణ్ తేజ్ క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ చాలా అద్భుతంగా చూపించాడు.

    కరుణ కుమార్ తను పేపర్ మీద ఏదైతే రాసుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేశాడు. కానీ కొంతవరకు తడబడ్డట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది…ఇక సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటి వరకు సినిమా స్లోగా సాగుతూ వచ్చింది. కానీ సెకండాఫ్ లో కొన్ని హై మూమెంట్స్ ఉండడంతో సినిమాని చూస్తున్న ప్రేక్షకుడికి బోర్ అయితే కొట్టకుండా ముందుకు సాగుతుంది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలు హిట్టయ్యాయా ప్లాప్ అయ్యాయా అనే విషయాన్ని పక్కన పెడితే ఇందులో డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక తను ఎప్పుడూ రొటీన్ రెగ్యూలర్ ఫార్మాట్ సినిమాలు చేయకుండా వైవిధ్యబరితమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి వరుణ్ తేజ్ కు సక్సెసులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కానీ హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆయన మాత్రం డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

    ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన మీనాక్షి చౌదరి కూడ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా అద్భుతంగా ఉండడంతో సినిమా మీద ఆటోమేటిగ్గా అంచనాలైతే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా చూడడానికి చాలామంది ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక నోరా ఫతేహి, కిషోర్ లాంటి నటులు వాళ్ల పరిధి మేరకు చాలా బాగా నటించి మెప్పించారనే చెప్పాలి…

    టెక్నికల్ అంశాలు

    ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ పెద్దగా ప్రేక్షకులు ఆకట్టుకోకపోయినా కూడా బ్యా గ్రౌండ్ స్కోర్ తో మాత్రం కొంతవరకు మ్యాజిక్ అయితే చేశాడు. మరి తన గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంతవరకు మ్యూజిక్ అయితే తగ్గిందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఫీల్ ని చెడగొట్టకుండా మ్యూజిక్ అందించడం తో సినిమా చూస్తున్నంత సేపు ఏ ప్రేక్షకుడు కూడా ఆ పాత్రల నుంచి డివియేట్ అవ్వకుండా సాగే అవకాశం అయితే ఉంది…

    ఇక ఆటోమేటిగ్గా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక విజువల్స్ చాలా టాప్ రేంజ్ లో చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఇక ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచించి సినిమాను ముందుకు తీసుకెళ్లే డైరెక్టర్ ఇక సినిమాటోగ్రాఫర్ నుంచి చాలా మంచి విజువల్స్ ని రాబట్టుకోవడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…

    ప్లస్ పాయింట్స్

    వరుణ్ తేజ్ యాక్టింగ్
    కొన్ని ఎలివేషన్ సీన్స్
    విజువల్స్

    మైనస్ పాయింట్స్

    సినిమా మధ్య లో కొంచెం బోర్ కొట్టింది…
    మ్యూజిక్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది…

    రేటింగ్

    ఇక ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.5/5

    చివరి లైన్

    యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను నచ్చుతుంది…