Vadhuvu Web Series Review: ప్రస్తుతం తెలుగులో థ్రిల్లర్ సినిమాల హవా ఎక్కువగా నడుస్తుంది. చిన్న సినిమాలను తీసుకుంటే థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కి మంచి గుర్తింపును సంపాదించు కుంటున్నాయి. చిన్న సినిమాలు థ్రిల్లింగ్ అంశాలతో వస్తేనే ఎక్కువ సక్సెస్ సాధిస్తాయని ఇప్పటికే చాలా సినిమాలు సీరీస్ లు వచ్చి ప్రూవ్ చేశాయి… అదే ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి లో బడ్జెట్ లో సినిమాలైనా, సీరీస్ లు అయిన థ్రిల్లర్ జానర్ లో వచ్చి మంచి సక్సెస్ లను అందుకుంటున్నాయి.
ఇక గత వారం నాగచైతన్య హీరోగా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన దూత సిరీస్ కూడా ఒటిటి ప్లాట్ ఫారం లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు అవికా గోర్ కీలకపాత్రలో నటించిన వధువు సిరీస్ కూడా థ్రిల్లర్ కథాంశంతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సిరీస్ ఎలా ఉంది..? అవికా గోర్ మళ్లీ హీరోయిన్ గా సక్సెస్ అయిందా..? లేదా..? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా కథలోకి వస్తే ఇందు ( అవికా గోర్)అనే అమ్మాయి పెళ్ళి చాలా సార్లు ఓకే అయి రకరకాల కారణాల చేత ఆగిపోతూ ఉంటుంది.ఎన్ని సంబంధాలు చూసినా కూడా పెళ్లి దాకా వచ్చి ఆగిపోతూ ఉంటాయి.అలా ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు ఇక చివరికి ఆనంద్ (నందు) తో ఇందు పెళ్లి అవుతుంది.ఇక దాంతో ఆమె పెళ్లి కోరిక అనేది తీరిపోతుంది. కానీ పెళ్లయిన తర్వాత ఆమెకి మరో అపద వచ్చి పడుతుంది కొందరు ఆమె పైన హత్య ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఇక ఇలాంటి సమయంలోనే ఇందు ఆడపడుచు మీద హత్య ప్రయత్నం జరుగుతుంది.ఇక అదే విధంగా నందు తమ్ముడు అయిన ఆర్య(అలీ రజా) పెళ్లి కూడా మండపం దాకా వచ్చి ఆగిపోతుంది. ఇంకా దాంతో వీళ్లను చంపడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు..? అసలు పెళ్లిళ్లు ఆగిపోవడం కారణం ఏంటి..? అనే విషయాలని తెలుసుకోవాలంటే మీరు డిస్నీ హాట్ స్టార్ లో మీరు ఈ సిరీస్ చూడాల్సిందే…
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సీరీస్ దర్శకుడు అయిన పోలూరు కృష్ణ ఎంచుకున్న కథ బాగానే ఉన్నప్పటికీ దాన్ని తెరకెక్కించడంలో మాత్రం డైరెక్టర్ కొంచం కన్ఫ్యూజ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ సిరీస్ స్టార్ట్ అయిన మొదటి 3 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగినప్పటికీ తర్వాత వచ్చే ఎపిసోడ్లు మాత్రం బోరింగ్ గా సాగుతూ ఉంటాయి. మొత్తం 7 ఎపిసోడ్స్ గా ఈ సీరీస్ వచ్చినప్పటికీ ఈ సీరీస్ ఎంతవరకు ఆకట్టుకోలేకపోయింది. ఇది చూస్తున్నంత సేపు కొన్ని థ్రిల్లింగ్ అంశాలు అనిపించినప్పటికీ మిగతా మొత్తం కూడా నార్మల్ గానే సాగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలో దర్శకుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఒకానొక స్టేజ్ లో మనకు అర్థం కాదు. ఏదో సీరీస్ నడుస్తుంది కదా అంటే నడుస్తుంది అన్న రేంజ్ లో వెళ్తూ ఉంటుంది తప్ప పెద్దగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే ఏమీ ఉండవు దానివల్ల ఈ సిరీస్ అనేది కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది.
అక్కడక్కడ కొన్ని ట్విస్ట్ లు వచ్చినప్పటికి వావ్ అనే ట్విస్ట్ అయితే ఒకటి కూడా ఉండదు. దానివల్లే ఈ సిరీస్ ని చూసే ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో ఉండదు. ఎంతసేపు ఎప్పుడూ అయిపోతే బాగుండు అన్నట్టుగానే సీరీస్ అనేది సాగుతూ ఉంటుంది… సిరీస్ ని తెరకెక్కించడంలో డైరెక్టర్ చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ లో ఉంచి మిగితా కథ అంతా చెప్పేసి మెయిన్ పాయింట్ ని ట్విస్ట్ గా వాడుకొని ఉంటే బాగుండేది. అప్పుడైతే ప్రేక్షకుడికి ఈ సిరీస్ ని చూడాలని ఇంట్రెస్ట్ కూడా కలిగేది ఆటోమేటిక్ గా సీరీస్ అనేది సక్సెస్ ఫుల్ గా సాగేది…
ఇక ఆర్టిస్టులు పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే అవిక గోర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చిన్నారి పెళ్ళికూతురుగా బుల్లితెర నుంచి వచ్చిన ఈ అమ్మడు తెలుగులో మంచి సినిమాలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది. ఏ క్యారెక్టర్ లో అయినా పూర్తి ఎఫర్ట్ పెట్టి నటించడం లో తను ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా అవికా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి ఎమోషన్స్ ని పండించడంలో ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ నటించింది. అందుకే ఈ సీరీస్ ని అంతో ఇంతో చూస్తున్నారు అంటే అది ఒక అవికా గోర్ వల్లనే అని చెప్పొచ్చు… నందు పర్ఫామెన్స్ విషయానికొస్తే ఈయన కెరియర్ మొదటి నుంచి కూడా సినిమాలో గాని, సిరీస్ లో గాని ఉంటారు కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించే క్యారెక్టర్ అయితే చేయరు.ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నా కూడా ఆయన క్యారెక్టర్ లో డెప్త్ అయితే ఏ సినిమాలో కనిపించదు. ఇక అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే తప్ప ఆయన వల్ల సీరీస్ కి ఏమి హెల్ప్ అవ్వలేదు. ఆయన ఎప్పుడూ ఒక మూస ధోరణి లో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు… ఇక అలీ రజా కూడా తన పాత్రలో కొంతవరకు అయితే ప్రయత్నం చేశాడు… ఇక మిగిలిన ఆర్టిస్టులు అందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
ఇక టెక్నికల్ అంశాల పనితీరు విషయానికి వస్తే ఈ సీరీస్ కి మ్యూజిక్ అందించిన శ్రీరామ్ మద్దూరి నేపథ్య సంగీతం ఓకే అనిపించేలా ఇచ్చాడు అంతే తప్ప ఆయన పెద్దగా దృష్టి పెట్టి మ్యూజిక్ కొట్టినట్టుగా కనిపించలేదు. ఏదో సీన్ ఉంది కాబట్టి దానికి తగ్గ మ్యూజిక్ చేయాలి కాబట్టి చేశారు అంతే తప్ప అది పూర్తి డెప్త్ తో అయితే మ్యూజిక్ ఇవ్వలేదు అది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది…ఇక రామ్ కే మహేష్ సినిమాటోగ్రఫీలో కొన్ని షాట్స్ బాగా తీసినప్పటికీ విజువల్ గా ఈ సిరీస్ మాత్రం గ్రాండియర్ గా కనిపించదు. విజువల్ గా కొన్ని సీన్ల ల్లో కొన్ని షాట్స్ మాత్రమే బాగా తీశాడు. మిగతాదంతా నార్మల్ గానే అనిపించింది… అయితే ఈ సిరీస్ ని చేస్తున్నాం కదా అంటే చేస్తున్నాం అన్నట్టుగానే చేశారు తప్ప ఏ ఒక్కరూ కూడా 100% వాళ్ళ పూర్తి ఎఫర్ట్ పెట్టి చేసినట్టుగా లేదు. డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అదే మిస్టేక్ ని చేశారు దాని వలన ఈ కథ అనేది బాగున్నప్పటికీ దాన్ని సరిగ్గా తెరకెక్కించలేక దాన్ని ఒక హై స్టాండర్డ్ లో నిలబెట్టడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు…
ఇక ఈ సీరీస్ ని చూడాలి అనుకునే వారు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది చూడండి…
ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే…
అవికాగోర్ యాక్టింగ్
ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే
అవిక గోర్ యాక్టింగ్ మినహాయిస్తే మిగిలినవి అన్ని మైనస్ పాయింట్స్ అనే చెప్పాలి…
ఇక ఈ సీరీస్ కి మేము ఇచ్చే రేటింగ్ 1.5/5