Salaar: ప్రభాస్ హీరోగా భారీ అంచనాలతో వస్తున్న సలార్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఇక ఇప్పటికే చాలా మంది మీద సగటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో ఒక స్టార్ హీరో వదిన కూడా ఒక పవర్ ఫుల్ పాత్ర లో కనిపించబోతున్నదన్న విషయం చాలా మందికి తెలియదు.
సలార్ లో ప్రభాస్ ని ఢీ కొడుతున్న ఆ స్టార్ హీరో వదిన…
ఇక రీసెంట్ గా వదిలిన సలార్ ట్రైలర్ లో కూడా ఆమెకు సంబంధించిన ఒక రెండు షాట్స్ ని వదలారు. ఒక రాయల్ లుక్ లో చీర కట్టుకొని తేజస్సు గల ముఖం తో టీవీ గా నడుచుకుంటూ వచ్చే ఒక షాట్ లో తను కనిపిస్తుంది ఇక ఆమె ఎవరు అంటే శ్రియ రెడ్డి…తమిళంలో సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న విశాల్ వాళ్ళ వదిన… ఈమె 2002వ సంవత్సరం నుంచి సినిమాల్లో నటిస్తుంది. ఇప్పటికీ ఆమె వయసు 40 సంవత్సరాలు అయిన కూడా చాలా ఎనర్జీతో నటిస్తుంది. ఇక ఈ సినిమాలో ఆమె పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఆమె పాత్ర చిత్రీకరణ చూస్తే బాహుబలిలో శివగామి పాత్ర ఎంతటి పవర్ ఫుల్ పాత్రనో ఇది కూడా అంతటి పవర్ ఫుల్ పాత్ర నే అని చిత్ర యూనిట్ చెప్తుంది.

ఇక ప్రభాస్ ని ఢీ కొట్టే పాత్రలో నటించబోతున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ సినిమాతో ఆమె పాన్ ఇండియా నటిగా మంచి పేరు సంపాదించుకోవడం పక్క అంటూ కోలీవుడ్ మీడియా సైతం ఆమె మీద పాజిటివ్ గా స్పందిస్తుంది. అయితే విశాల్ వాళ్ళ అన్నయ్య విక్రమ్ శ్రియ రెడ్డి ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.ఇక విక్రమ్ ప్రొడ్యూసర్ గా మంచి పేరు సంపాదించుకుంటుంటే ఈమె మాత్రం నటిగా సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది. ఒక పవర్ ఫుల్ పాత్ర ఉంది అని ఆమెని సంప్రదిస్తే మాత్రం ఆమె తప్పకుండా ఆ పాత్రలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇక అందులో భాగంగానే ఈమె సలార్ సినిమాలో కూడా పవర్ ఫుల్ పాత్ర లో నటించినట్టు గా తెలుస్తుంది.
ప్రశాంత్ నీల్ ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు తనని ఊహించుకొని ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టుగా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఆ క్యారెక్టర్ సినిమా మొత్తానికి ఒక కీలకమైన మలుపు కాబోతుంది అని ప్రశాంత్ నీల్ ఒక సందర్భంలో తెలియజేశాడు…మరి ఈ పాత్రలో ఆమె ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందనేది డిసెంబర్ 22వ తేదీన సినిమా రిలీజ్ అయితే గానీ తెలియదు…