https://oktelugu.com/

Sattam En Kaiyil Review: ఓటిటిలో దుమ్మురేపుతున్న ‘సట్టమ్ ఎన్ కైయిల్’ ఫుల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్…

'సట్టమ్ ఎన్ కైయిల్' అనే పేరుతో వచ్చిన ఈ సినిమాలో అసలు ఏముంది అంతలా ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : November 24, 2024 12:42 pm
    Sattam En Kaiyil Review

    Sattam En Kaiyil Review

    Follow us on

    Sattam En Kaiyil Review: ప్రస్తుతం ఓటిటి లో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక దానికి అనుగుణంగానే తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఓటిటిలో ది బెస్ట్ వ్యూయర్ షిప్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ‘సట్టమ్ ఎన్ కైయిల్’ అనే పేరుతో వచ్చిన ఈ సినిమాలో అసలు ఏముంది అంతలా ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే తమిళనాడులోని ఏర్కాండ్ పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి తన కొడుకు మిస్ అయ్యాడనే కంప్లైంట్ ఇవ్వడంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక అందులో భాగంగానే గౌతమ్ (సతీష్) డ్రింక్ చేసి కారు నడుపుతూ ఉంటే అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చి ఆ కారుకు తగలడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు. ఇక అతని బాడీని తన డిక్కీలో వేసుకొని వెళ్తుంటే ఎదురుగా ఒక చెక్ పోస్ట్ అయితే కనిపిస్తుంది. అందులో పోలీసులకి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన గౌతమ్ ను ఏర్కాండ్ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారు. ఇక డిక్కీలో ఉన్న బాడీ సంగతి వాళ్లకు తెలియదు. అసలు ఆ బాడి ఎవరిది? మొదట్లో ఆ మిస్ అయిన వ్యక్తి ఎవరు కార్ డిక్కీ లో ఉన్న వ్యక్తికి గౌతమ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను మీరు చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక విశ్లేషణ విషయానికి వస్తే క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు చాచి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక మొత్తానికైతే ఆయన అనుకున్న పాయింట్ ను మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్ గా చెప్పడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్ గా రాసుకోవడమే అతనికి చాలా వరకు ప్లస్ అయింది. ప్రతి సీన్ లో ఒక ఇంటెన్స్ డ్రామాని క్రియేట్ చేయడంలో తను చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రతి పాత్రలో కొత్తదనాన్ని తీసుకొచ్చే విధంగా ఆయన రాసుకున్న రైటింగ్ స్టైల్ ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక స్క్రీన్ ప్లే ప్రకారం చూసుకున్నా కూడా ఈ సినిమాలో డిఫరెంట్ స్క్రీన్ ప్లేని వాడి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడమే కాకుండా థ్రిల్లర్ కి గురి చేసే చాలా అంశాలు ఇందులో మిళితమై ఉండడం అనేది సినిమాకి చాలావరకు హెల్ప్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. ఇక మ్యూజిక్ అంత ఎఫెక్టివ్ గా అనిపించినప్పటికి కొన్ని విషయాల్లో మాత్రం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు హెల్ప్ అయింది. ఆద్యంతం సస్పెన్స్ గొలిపే అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేగ్ చేస్తుంది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన సతీష్ ఇప్పటివరకు అన్ని కామెడీ సినిమాలనే చేశాడు. ఫస్ట్ టైం సీరియస్ రోల్ లో తన నటనను అద్భుతంగా ఆవిష్కరించడమే కాకుండా ఒక తెలియని ఇంటెన్స్ యాక్టర్ ని కూడా బయటికి తీశాడనే చెప్పాలి. దర్శకుడు ఏ మేరకు తనలోని నటన ప్రతిభను బయటకు తీయాలి అనుకున్నాడో అంతకుమించి ఆయన సీరియస్ రోల్ లో సినిమా చేసి సక్సెస్ లో చాలా వరకు హెల్ప్ చేశాడు. అతనితో పాటు మిగతా పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరు ది బెస్ట్ నటనని ప్రదర్శించడంతో సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది…

    టెక్నికల్ అంశాలు

    ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి సినిమాటోగ్రఫీ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయిందనే చెప్పాలి. సస్పెన్స్ గొలిపే సన్నివేశాల్లో సినిమాటోగ్రాఫర్ వాడిన షాట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు విజన్ కు ప్రియారిటి ఇస్తు సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి చాలా అందమైన విజువల్స్ ని అందించాడనే చెప్పాలి. ఇక ఉన్నంతలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా కుదిరాయి…

    ప్లస్ పాయింట్స్

    స్క్రీన్ ప్లే
    సతీష్ యాక్టింగ్
    ట్విస్టులు

    మైనస్ పాయింట్స్

    కొన్ని సీన్లు గ్రిప్పింగ్ లేవు
    ఇంట్రడక్షన్ సీన్లు బోరింగ్ ఉన్నాయి..
    మ్యూజిక్

    రేటింగ్
    ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

     

    Sattam En Kayil  - Official Teaser | Sathish, Vidhya Pradeep, Mime Gopi | Chachhi | M.S.Jones Rupert