Homeప్రత్యేకంEagle Movie Review: ఈగల్ మూవీ రివ్యూ...

Eagle Movie Review: ఈగల్ మూవీ రివ్యూ…

Eagle Movie Review: హీరో రవితేజ హిట్టు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. గతేడాది దసరా కానుకగా వచ్చిన టైగర్ నాగేశ్వర రావు సినిమా పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో చేసిన ఈగల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా సక్సెస్ మీద మొదటి నుంచి సినిమా యూనిట్ మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు. అయితే ఈ రోజు రిలీజ్ అయిన ఈగల్ సినిమాతో రవితేజ మరొకసారి బౌన్స్ బ్యాక్ అయి భారీ సక్సెస్ ని అందుకున్నాడా? కార్తీక్ ఘట్టమనేని ఇండస్ట్రి లో ఇక డైరెక్టర్ గా సెటిలైపోయినట్టేనా? అనే విషయాలను ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో రవితేజ ఒక అడవి ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. ఆయన చుట్టుపక్కల ఏ అన్యాయం జరిగినా కూడా తను రియాక్ట్ అవుతూ తన అనుకునే వాళ్లను కాపాడుకుంటూ బతుకుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలోనే కొంతమంది పోలీసులు రవితేజ ని అడవి నుంచి బయటికి తీసుకురావాలి అని కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సమయంలో రవితేజ అడవి నుంచి బయటకి వస్తే అతన్ని అరెస్టు చేయాలని పోలీస్ లు చూస్తుంటారు. రవితేజ కోసం పోలీస్ లు ఎందుకు వెతుకుతున్నారు. ఆయన గత చరిత్ర ఏంటి అనే సస్పెన్స్ ను కొలిపే సీన్లతో ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. రవితేజ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే…

విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంచుకున్న స్టోరీ బావుంది. అలాగే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా చాలావరకు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగానే ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే డైలాగులను గాని, సాంగ్స్ గాని డిజైన్ చేయించుకున్న విధానం కూడా అద్భుతమనే చెప్పాలి. ఇక ఈ కథకి రవితేజను ఎంచుకొని కూడా దర్శకుడు ఒక మంచి పని చేశాడు. అయితే ఈ సినిమాలో దర్శకుడు ఎక్కువగా యాక్షన్ పార్ట్ ని నమ్ముకొని ముందుకు వెళ్లాడు. కథపరంగా అక్కడక్కడా కొంచెం లూప్ హోల్స్ ఉన్నప్పటికీ రవితేజ తన నటనతో ఆ సినిమా చూసే ప్రేక్షకుడికి ఆ లూప్ హొల్స్ గుర్తు రాకుండా మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఇక కొన్ని సీన్లలో అయితే రవితేజ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. దర్శకుడు రాసుకున్న బలమైన సీన్లకి తన యాక్టింగ్ ద్వారా రవితేజ ప్రాణం పోశాడు. ఈ సినిమా చూసే ప్రేక్షకుడిని రవితేజ కొన్ని సందర్భాల్లో ఏడిపిస్తాడు. ఇక ఫస్టాఫ్ కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండినప్పటికీ, సెకండ్ హాఫ్ లో మాత్రం అసలైన స్టోరీ ఏంటి అనేది చూపించాడు. ఇక ప్రతి క్యారెక్టర్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ క్యారెక్టర్ తాలూకు డిజైనింగ్ అనేది క్లారిటీ గా చేసుకుంటూ వచ్చాడు. ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళ క్యారెక్టర్ లో ఇంటెన్స్ పెర్ఫా మెన్స్ ని ఇచ్చారు. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాలో విజువల్స్ ని కూడా టాప్ నాచ్ లో చూపించాడు.. మహి బాబు కరణం రాసిన డైలాగులు కూడా సినిమాలో ఎమోషన్ ను బాగా ఏలివెట్ చేశాయి. కరెక్ట్ గా ఏ టైం లో ఎలాంటి డైలాగ్ పడలో అలాంటి డైలాగ్స్ రాసి సక్సెస్ అయ్యాడు.

ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికొస్తే రవితేజ సినిమా భారం మొత్తాన్ని తన భుజాలపై మోసాడు అనే చెప్పాలి. ప్రతి సీన్ లో ఇంటెన్స్ పెర్ఫా మెన్స్ ని ఇస్తూ ఇంతకు ముందు రవితేజ ఎప్పుడూ కనబరచని ఒక కొత్త వేలో తనని తాను మౌల్డ్ చేసుకొని మరి పెర్ఫామ్ చేశాడు. ఆయన ఆక్టింగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇక ఆయనతో పాటుగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధుబాల, శ్రీనివాస్ అవసరాల, కావ్య థాపర్ లాంటి నటీనటులు వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ఇక వీళ్లిద్దరూ ఇంతకు ముందు లా కాకుండా ఒక కొత్త వేలో యాక్టింగ్ ను డెలివరీ చేసి సక్సెస్ అయ్యారు…

టెక్నికల్ అంశాలు
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి దర్శకుడు సినిమాటోగ్రాఫర్ ఒక్కరే అవ్వడం వల్ల ఈ సినిమా స్టోరీ ని ఎలాగైతే తను ఇమజిన్ చేసుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం లో కార్తీక్ ఘట్టమనేని సక్సెస్ అయ్యాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జంద్ ఈ సినిమాలో కొన్ని సీన్లని ఎలివేట్ చేయడంలో తన వంతు పాత్ర అయితే పోషించాడు. ముఖ్యంగా ఈ సినిమాకి ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలవడమే కాకుండా, ఈ సినిమా మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది.

ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే

రవితేజ యాక్టింగ్
డైరెక్షన్
యాక్షన్ సీక్వెన్సెస్

ఇక ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే

స్టోరీ లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి

ఒక ఇంటెన్స్ డ్రామా ని క్రియేట్ చేయడంలో దర్శకుడు కొద్ది వరకు తడబడ్డాడు…

రేటింగ్
ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular