Mad Square Movie Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ కథలతో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు వచ్చిన ‘మ్యాడ్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్ గా ప్రస్తుతం ‘మ్యాడ్ స్క్వేర్’ అనే సినిమా చేశారు. అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. మ్యాడ్ ఎలాగైతే హిట్ అయిందో దానికి మించిన సక్సెస్ ని ఈ సినిమా సాధించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే లడ్డు గాని పెళ్లి ఎలా జరిగింది? వాడు పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళాడ. వాడి లైఫ్ తో మ్యాడ్ గ్యాంగ్ ఎలా ఆడుకున్నారు. లడ్డు గాడి తన పెళ్ళాంతో కలిసి ఉన్నాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు ఎంటర్టైనర్ గా తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతి సీన్ లో ఏదో ఒక కామెడీ సీన్ ని పెట్టించే ప్రయత్నం అయితే చేశాడు. అయితే కొంతవరకు కామెడీ ఓకే అనిపించినప్పటికి ప్రతి సీన్ లో కామెడీ చేస్తు ఉండటం అవి జబర్దస్త్ కామెడీ కంటే కూడా దారుణంగా ఉండడంతో సినిమా చూసే ప్రేక్షకులు కొంతవరకు నిరాశ చెందే అవకాశాలైతే ఉన్నాయి. ఇక కొన్ని కామెడీ సీన్స్ అద్భుతంగా ఉన్నప్పటికి ఎప్పుడు రొటీన్ రొట్ట కామెడీని ఫాలో అవుతూ ముందుకు సాగడం వల్ల సినిమా మీద కొంత వరకు మనకు ఇదేం కామెడీ అనే ఒక భావన అయితే కలుగుతుంది…
మ్యాడ్ సినిమా అయితే ఉన్నప్పటికి అప్పటివరకు అలాంటి సినిమా రాలేదు. కాబట్టి ఆ సినిమా వర్కౌట్ అయింది. మళ్ళీ అదే కామెడీతో సినిమా చేస్తే ఈ సినిమా మీద అంత హైప్ అయితే ఉంటుందేమో కానీ అంతా సక్సెస్ అయితే అందుకోకపోవచ్చు అంటూ మొదటి నుంచి కూడా కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి వాటికి తగ్గట్టుగానే ఇందులో మరీ రొటీన్ రొట్ట కామెడీ ఉండటం వల్ల కొన్ని సీన్లు హైలైట్ అయినప్పటికీ మరికొన్ని సీన్లు మాత్రం డీలపడ్డాయనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ లు చాలా బెస్ట్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు వచ్చిన ప్రతి సీను కూడా ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్వించింది. ముగ్గురికి మంచి ఫ్యూచర్ ఉందనే చెప్పాలి… ఇక మిగతా ఆర్టిస్టులందరు కూడా వాళ్ళ కామెడీని ఎలివేట్ చేస్తూ సినిమాకి ఏదైతే కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక మొత్తానికైతే ప్రతి పాత్రకి వాళ్ళు న్యాయం చేయడానికి ప్రయత్నమైతే చేశారు…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. బీమ్స్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ అద్భుతంగా ఉండటమే కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ ని కూడా చాలా బాగా ఎలివేట్ చేశాడు. కామెడీ సీన్స్ లో వాడిన కొన్ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. దాని వల్ల ప్రేక్షకుడికి ఆ కామెడీ అనేది బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి… ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. ఇక సితార వాళ్ళు అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
సంగీత శోభన్ టైమింగ్
మైనస్ పాయింట్స్
కథ లేకపోవడం
రొటీన్ కామెడీ
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5