Homeఎంటర్టైన్మెంట్మూవీ రివ్యూKrishnamma Review: కృష్ణమ్మ ఫుల్ మూవీ రివ్యూ...

Krishnamma Review: కృష్ణమ్మ ఫుల్ మూవీ రివ్యూ…

Krishnamma Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది సత్యదేవ్ అనే చెప్పాలి. తన 10 సంవత్సరాల కెరియర్ లో ఆయన ఇప్పటివరకు చాలా రకాల పాత్రలను పోషించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను మైమరపింపజేశాడు. ఇక అలాగే విలన్ పాత్రలను కూడా చేసి అందులో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అలాంటి సత్య దేవ్ ఇప్పుడు కృష్ణమ్మ అనే ఒక సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడానికి ఈరోజు థియేటర్లోకి వచ్చాడు. మరి ఈ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించిందా సత్యదేవ్ ఈ సినిమాతో ఫుల్ టైం హీరోగా మారనున్నాడా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

250 మంది కుటుంబాలు ఉన్న ఇచ్చి పేట అనే గ్రామంలో 1000 పైగా కేసులు అయితే ఉంటాయి. కొంతమంది వీళ్ళను కొన్ని కేసుల్లో ఇరికిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఇక అలాంటి క్రమంలోనే భద్ర తన ఫ్రెండ్స్ కూడా ఒక కేసులో ఇరికించబడతారు. ఇక వీళ్ళకి ముందు వెనక ఎవరూ లేరు కాబట్టి వీళ్ళని ఏం చేసినా ఎవరు ఏమి చేయలేరు అనే ఉద్దేశ్యం తోనే కొంతమంది కావాలని వీళ్లను కేసుల్లో ఇరికించి జైలుకు పంపిస్తారు. ఇక అక్కడి నుంచి అణిచివేతకు గురవుతున్న వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. మరి ఆ తిరుగుబాటులో వీళ్ల పైన అధికారాన్ని చెలాయించే వారిని హతం చేశారా లేదా వీళ్లే అంతమయ్యారా అనేది తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు వివి గోపాలకృష్ణ రాసుకున్న కథలో కన్ఫ్లిక్ట్ అయితే చాలా బాగుంది. ఇక కొన్ని క్యారెక్టర్స్ ని రా గా రాసుకున్నాడు. అందులో హీరో భద్ర క్యారెక్టర్ ఒకటి..మంచి మాత్రమే తెలిసిన భద్ర చేత కత్తి పట్టించడానికి రాసుకున్న సీన్లు చాలా బలంగా ఎలివేట్ అయ్యాయనే చెప్పాలి. ఎక్కడైతే మనం అణిచివేతకు గురవుతామో అక్కడి నుంచి ఒక కొత్త ఉద్యమం స్టార్ట్ అవుతుంది అనే పాయింట్ ను రైజ్ చేస్తూ ఈ సినిమా వచ్చింది. అయితే ఇప్పటివరకు ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ఇక ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రకం గా వాళ్ల కథలను ప్రజంట్ చేశాయి. ఇక ఈ సినిమా కూడా చాలా కొత్తగా ఉందనే చెప్పాలి…

సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ అయితే సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. నిజానికి సెకండాఫ్ లో వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ ను ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. నిజానికి యాక్షన్ సీక్వెన్స్ సినిమా చూసే ప్రేక్షకుడికి ఎక్కాలి అంటే అందులో ఉన్న కోర్ ఎమోషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అలాంటప్పుడే ఆ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక దీన్ని బాగా అబ్జర్వ్ చేసిన డైరెక్టర్ గోపాలకృష్ణ కోర్ ఎమోషన్ ని పండించడంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు. ఇక సత్యదేవ్ యాక్టింగ్ కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిందనే చెప్పాలి. ఇక మీనా క్యారెక్టర్ ని పోషించిన అతిరా రాజ్ క్యారెక్టర్ లో వేరియేషన్స్ అనేవి చాలా బాగా రాసుకున్నారు. ఒక రకంగా ఆమె క్యారెక్టర్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది…

అయితే ఫస్ట్ ఆఫ్ లో సినిమా స్టార్ట్ అయిన వెంటనే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కొంచెం టైం తీసుకోవడం అనేది సినిమా చూసే ప్రేక్షకుడిని కొంతవరకు బోర్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అయినప్పటికీ ఆ తర్వాత సినిమా చాలా ఫాస్ట్ గా వెళుతూ ఉంటుంది…ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా స్టాండర్డ్ ను బట్టి చాలా రిచ్ గా ఉన్నాయనే చెప్పాలి… ఇక ఈ సినిమాకి కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సత్యదేవ్ మరోసారి భద్రగా తన నట విశ్వరూపాన్ని చూపించాడు. సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇస్తూ అందులోనే భయం, రౌద్రం లాంటి నవరసాలను పోషిస్తూ ఆయన పండించిన నటన అద్భుతంగా ఉంది. సత్యదేవ్ చాలా మంచి నటుడు అనే విషయం మనందరికీ తెలిసిందే.

ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా నటన పరంగా చాలా వరకు వైవిధ్యానైతే ప్రదర్శించేవాడు. ఇప్పుడు కూడా అదే పాటర్న్ లో సినిమాని ముందుకు నడిపించడంలో తను చాలా వరకు హెల్ప్ అయ్యాడు. ఇక అతిరా రాజ్, అర్చన అయ్యర్ లాంటి నటీమణులు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. రఘు కుంచే, లక్ష్మణ్ పాత్రలు కూడా సినిమాలో చాలా కీలకంగా ఉన్నాయి. కాబట్టి వీళ్లు చాలా అద్భుతంగా నటించి మెప్పించారనే చెప్పాలి… ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ తమ పాత్రల పరిధిని మించకుండా చాలా బాగా నటించి సినిమా బాగా రావడానికి హెల్ప్ చేశారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే కాలభైరవ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి కొంతవరకు హెల్ప్ అయింది. సాంగ్స్ పరంగా చూసుకుంటే అంత పెద్ద ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మాత్రం చాలా వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఇంతకుముందు తను చేసిన సినిమాలన్నింటి కంటే కూడా ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి ఒక డ్రామా ను ప్లే చేసే సినిమాలకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా కీలకం అని అర్థం చేసుకున్న కాలభైరవ సీన్ ఇంపార్టెన్స్ మిస్ అవ్వకుండా ప్రతి సీన్ కి ఓ డిఫరెంట్ స్కోర్ ను అయితే అందించగలిగాడు… ఇక సన్నీ కూరపాటి విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. కృష్ణమ్మ అందాలని చాలా అద్భుతంగా చూపించడంలో తను చాలా వరకు సక్సెస్ అయ్యాడు.

హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ లో తను వాడిన ఫ్రేమ్స్ కానీ, అద్భుతమైన లొకేషన్స్ ను కూడా చాలా బాగా క్యాప్చర్ చేసి ప్రేక్షకులు దృష్టిని ఆకర్షించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు… ఇక ఎడిటర్ తమ్మి రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఎడిటింగ్ చేయడంలో ఆయన మాస్టర్ పీస్ కాబట్టి ఈ సినిమాని కూడా చాలా ఈజ్ తో ఎడిట్ అయితే చేశారు…

ప్లస్ పాయింట్స్

సత్యదేవ్
కథ
బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది.

కొన్ని సీన్స్ సినిమా పరిధిని దాటి ఉన్నాయి…

కొన్ని సీన్లలో డైరెక్షన్ అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు…

రేటింగ్

ఈ సినిమాకు మేము ఇచ్చిన రేటింగ్ 2.5/5

చివరి లైన్

ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి వీలైతే ఒక్కసారి చూడొచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular