Harom Hara Movie Review: హరోంహర ఫుల్ మూవీ రివ్యూ…

ట్రైలర్ తోనే దాదాపు 5 నుంచి 6 కోట్ల వరకు బిజినెస్ ను కూడా జరుపుకుంది హరోంహర. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సుధీర్ బాబు ఒక భారీ సక్సెస్ ని అందుకున్నాడా లేదా అనేది మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం...

Written By: Gopi, Updated On : June 14, 2024 9:14 am

Harom Hara Movie Review

Follow us on

Harom Hara Movie Review: ప్రతి వారం కొన్ని సినిమాలు రిలీజ్ అయినట్టుగానే ఈ వారం కూడా సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ డైరెక్షన్ లో హరోంహర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ట్రైలర్ తోనే ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ ట్రైలర్ తోనే దాదాపు 5 నుంచి 6 కోట్ల వరకు బిజినెస్ ను కూడా జరుపుకుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సుధీర్ బాబు ఒక భారీ సక్సెస్ ని అందుకున్నాడా లేదా అనేది మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…

కథ

ఇక ముందుగా ఈ కథ విషయానికి వస్తే సుధీర్ బాబు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే ఈయన టార్గెట్ మాత్రం డబ్బులు ఎక్కువగా సంపాదించాలి అని అనుకుంటాడు. ఇక దాని ప్రకారమే తను డబ్బులు బాగా సంపాదించి టాప్ పొజిషన్ లో ఉండడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ల్యాబ్ అసిస్టెంట్ గా ఉంటే తనకు వచ్చే జీతం కూడా తనకు సరిపోవట్లేదు అనే ఉద్దేశ్యం తో గన్స్ ని తయారు చేస్తాడు. ఇక ఆ ప్రాసెస్ లో తన వాళ్లకి గన్ ను వాడటం పరిచయం చేయడం కోసమే ఈ సినిమా మొత్తం సాగుతుంది. మరి ఈ సినిమాలో సుధీర్ బాబుకి రౌడీలకి మధ్య ఎందుకు గొడవ జరుగుతుంది. వాళ్ళు అతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు జ్ఞాన సాగర్ ఈ సినిమా స్టోరీని ఏ ఉద్దేశ్యం తో రాసుకున్నాడో తెలీదు గానీ ఇందులో ఉన్న ప్రతి సీను కూడా మనకు ఏదో ఒక సినిమాలో ఇంతకు ముందు చూసినట్టుగానే అనిపిస్తుంది. ఇక మొదట ఫస్టాఫ్ చాలా ఎంగేజింగ్ గా నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ మాత్రం కే జి ఎఫ్ పుష్ప లాంటి సినిమాల నుంచి తీసుకున్నట్టుగా మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇక ఛత్రపతి సినిమాలోని ఛత్రపతి అనే ఒక ఎలివేటెడ్ సీన్ ని కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. అంటే రైటింగ్ లో ఎంత ఫ్లావుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఫస్టాఫ్ వరకు సగటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని సీన్లని చాలావరకు సాగదీశారు.

ఇక అలాగే రొటీన్ రొట్ట ఫార్ములలో సినిమా నడవడం అనేది కూడా ఈ సినిమాకి చాలా వరకు మైనస్ గా మారింది. మరి దర్శకుడు ఎందుకు అలాంటి సీన్ల ను రాసుకున్నాడు. ఇంతకు ముందు చూసిన సీన్ల నే మళ్ళీ చూస్తే ఆ క్యారెక్టర్ కి ఉండే ఎలివేషన్ ను ప్రేక్షకుడు ఓన్ చేసుకోలేడు. ఒక ఫ్రెష్ సీన్ కి వచ్చే మైలేజ్ చాలా బాగుంటుంది…ఇక మొత్తానికైతే సుధీర్ బాబుకి ఈ సినిమాతో మంచి సక్సెస్ పడుతుంది అని అనుకున్న ప్రతి ఒక్కరికి మరోసారి నిరుత్సాహమే మిగిలింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సుధీర్ బాబు కి పెద్దగా ప్లస్ అయింది అయితే ఏమీ లేదు. చిన్న హీరోలు మాస్ సినిమాలు చేయాలి అనుకోవడం కూడా చాలా పెద్ద తప్పు అనే చెప్పాలి.

ఎందుకంటే మాస్ సినిమాల్లో హై ఓల్టేజ్ సీన్లు ఎలివేషన్స్ ని పండించాలంటే గ్రాండీయర్ గా షూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటిని చిన్న బడ్జెట్ లో తీయలేరు. అలాగే చిన్నగా తీయాలి అనుకున్న కూడా ఆ సీన్ తాలూకు ఇంటెన్స్ అనేది మిస్ అవుతుంది కాబట్టి చిన్న హీరోలు మాస్ సినిమాలు చేయడం చాలా వరకు తగ్గిస్తే మంచిది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సుదీర్ బాబు అన్ని సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలో కూడా చాలా బాగా నటించి మెప్పించాడు. ఇక చిత్తూరు యాసలో కూడా చాలా బాగా డైలాగ్స్ చెప్పాడు. అయితే తను ఆశించినట్టుగా ఈ సినిమాతో మంచి విజయాన్ని అయితే అందుకోలేకపోయాడు. ఇక యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఒక బెస్ట్ అటెంప్ట్ అనే చెప్పొచ్చు… ఇక హీరోయిన్ గా చేసిన మాళవిక శర్మ కూడా కొంతవరకు ఓకే అనిపించింది. సునీల్ కి ఈ సినిమాలో ఫుల్ లెంత్ పాత్రను ఇచ్చినప్పటికీ ఆ పాత్రలో పెద్దగా నటించింది అయితే ఏమీ లేదు. ఇక ఆ పాత్ర కూడా సినిమాకి పెద్దగా మైలేజ్ ఇచ్చే పాత్ర కాకపోవడం వల్ల సినిమా చూసిన కూడా మనకు అంతగా రిజిస్టర్ అయితే అవ్వదు…ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు…

ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమా మొత్తం చాలా ప్లాట్ గా ఉన్నప్పటికీ చేతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ మాత్రం సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది. ఈ సినిమాలో ఆయన ఇచ్చిన మ్యూజిక్ ప్రకారం ఒక సాంగ్ అయితే బాగున్నప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక అందులో ఆయన సూపర్ సక్సెస్ అయినప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోవడం విశేషం… ఇక విజువల్స్ కూడా సినిమాకి కొంతవరకు ప్లస్ అయ్యాయి…ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించేలా ఉన్నాయి…

ప్లస్ పాయింట్స్

సుధీర్ బాబు యాక్టింగ్
ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్
కొన్ని సీన్లు మరి లాగ్ అయ్యాయి…
రోటీన్ సీన్లు…

రేటింగ్
ఇక ఈ సినిమా కు మెమిచ్చే రేటింగ్ 2/5

చివరి లైన్

కేజీఎఫ్ పుష్ప లా మాదిరి తీయాలనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు…

Tags