Family Star Review: విజయ్ దేవరకొండ పరశురాం కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. ఆ కాంబినేషన్ ను మరోసారి రిపీట్ చేస్తూ తెరకెక్కిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’… అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది విజయ్ భారీ సక్సెస్ ని అందుకున్నాడా లేదా వరుసగా విజయ్ పరుశురాం కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి సినిమాను మించి సక్సెస్ అయిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ఉన్న అబ్బాయిలా మనకు కనిపిస్తాడు. ఈ పాత్ర లో ఆయన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. ఫ్యామిలీ లో ఉన్న అన్ని సమస్యల మధ్యలో తను ఎలా నలిగిపోతూ ఉంటాడు. హీరోయిన్ మృణల్ కి తనకు మధ్య పెళ్లి తర్వాత వచ్చే విభేదాలు ఏంటి వాళ్లు కలిసి ఉంటారా లేదా విడిపోతారా అనే విషయాలను ప్రధానంశాలుగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు…మరి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాలను మనం మన అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కమర్షియల్ సినిమాలను తీయడంలో పరుశురాం చాలా మంచి డైరెక్టర్ అనే విషయం మనందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన పరుశురాం పూరి జగన్నాథ్ సినిమాలో ఎలాంటి ఫ్లేవర్ అయితే ఉంటుందో ఈయన సినిమాల్లో కూడా అదే ఫ్లేవర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇంతకు ముందే విజయ్ తో ఈయన చేసిన గీతా గోవిందం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ సినిమా కూడా ఎక్కువ అంచనాలతో రాకుండా మినిమం అంచనాల మధ్య వచ్చి మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కి కూడా ఇదే స్ట్రాటజీ ని అమలు చేస్తూ ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాతో విజయ్ సక్సెస్ సాధించినట్టే అని తెలుస్తుంది. దర్శకుడు ఫస్ట్ ఆఫ్ మొత్తాన్ని ఎంటర్ టైన్ మెంట్ వే లో నడిపించి సెకండాఫ్ లో ఎమోషనల్ టచ్ ఇచ్చి వదిలేసాడు.
ముఖ్యంగా విజయ్, మృణాల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే పరుశురాం రాసుకున్న సంభాషణలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. కొన్ని సీన్లలో ఆయన రాసిన డైలాగులు మాత్రం ప్రేక్షకుడి చేత కంట తడి కూడా పెట్టిస్తాయి అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాని దర్శకుడు నడిపించిన విధానం కూడా ఎక్కడ బోర్ లేకుండా చాలా ఎంగేజింగ్ తీసుకెళ్లాడు. అయితే పరుశురాం రాసుకున్న స్క్రీన్ ప్లే లో ఆయన అనుసరించిన విధానం బాగున్నప్పటికి కొన్నిచోట్ల విజిల్స్ కూడా వేయిస్తుంది.
ఇక విజయ్ బాడి లాంగ్వేజ్ కి ఎలాంటి కథ అయితే సరిపోతుందో సరిగ్గా అలాంటి కథతోనే ఈ సినిమాను తీర్చిదిద్దడం అనేది కూడా వీళ్ళకి ప్లస్ అయింది. పరశురాం తన గత సినిమా అయిన ‘సర్కారు వారి పాట’ సినిమాలో ఎలాంటి మిస్టేక్స్ అయితే చేశాడో ఈ సినిమాలో అవేమీ లేకుండా జాగ్రత్త పడుతూ ఒక మంచి సక్సెస్ ని సాధించే సినిమాకి ఎలాంటి వైబ్స్ అయితే కావాలో అలాంటి వైబ్ ని క్రియేట్ చేశాడు… ఇక పరుశురాం గోపి సుందర్ చేత ఒక మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ ను అయితే తీసుకురాగలిగాడు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు…మొదటి నుంచి చివరి వరకు చివరి వరకు ప్రతి ఫ్రేమ్ లో కూడా ఆయన కనిపించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక మృణాల్ ఠాకూర్ కూడా చాలా మెచ్యుర్డ్ పర్ఫామెన్స్ తో నటించి మెప్పించింది. సీత రామం లో ఎలాంటి అభినయం తో ఆకట్టుకుందో ఈ సినిమాలో కూడా చాలా మంచి నటనని కనబరిచింది. ఇక వీళ్ళతోపాటుగా ఈ సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులు కూడా సినిమా సక్సెస్ లో చాలా వరకు ప్లస్ అయ్యారనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ఆర్టిస్టులందరూ దర్శకుడుని ఫాలో అవుతూ నటించారు అనే విషయం చాలా స్పష్టం గా తెలుస్తుంది…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన గోపీసుందర్ గీతా గోవిందం రేంజ్ లో మ్యూజిక్ ని అందించలేకపోయిన ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ మాత్రం చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో కూడా ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఆ సినిమాలోని సీన్ ను ఎలివేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడ్డాయి… ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా చేసిన కేయూ మోహనన్ కూడా అద్భుతమైన విజువల్స్ ని అందించి సినిమా సక్సెస్ సాధించడంతో లో తన వంతు పాత్రను పోషించాడు.
ప్రతి ఫ్రేమ్ లో కూడా అద్భుతంగా కనిపించడమే కాకుండా సినిమాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్టు ను కూడా చాలా గ్లామర్ గా చూపించాడు. ఇక ఈ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన వాడిన కొన్ని షాట్స్ అయితే చాలావరకు ఈ సినిమా కి ప్లస్ అయ్యాయనే చెప్పాలి. ఇక మార్తాడు కె వెంకటేష్ చేసిన ఎడిటింగ్ అయితే సినిమాకు సరిగ్గా యాప్టయింది. ప్రతి సీన్ ను ఎంత లెంత్ లో కట్ చేయాలో అంతే లెంత్ లో కట్ చేసి సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించాడనే చెప్పాలి…
ప్లస్ పాయింట్స్
కథ
డైరెక్షన్
విజయ్ మృణల్ ఠాకూర్ కాంబో
ఎమోషనల్ డైలాగ్స్
మైనస్ పాయింట్స్
సినిమా కొంచం స్లో అయింది…
గోపి సుందర్ మ్యూజిక్ కొంత వరకు మైనస్ అయింది…
రేటింగ్
ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.75/5
చివరి లైన్
ఫ్యామిలీ స్టోరీస్ ను ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడవచ్చు…