Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Family Star Twitter Review: ఫ్యామిలీ స్టార్ ట్విట్టర్ రివ్యూ: విజయ్ దేవరకొండకు ఊహించని దెబ్బ,...

Family Star Twitter Review: ఫ్యామిలీ స్టార్ ట్విట్టర్ రివ్యూ: విజయ్ దేవరకొండకు ఊహించని దెబ్బ, ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందిగా!

Family Star Twitter Review: హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ ముగిశాయి. మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మరి ఫ్యామిలీ స్టార్ ట్విట్టర్ టాక్ ఏమిటో చూద్దాం. విజయ్ దేవరకొండ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. 2018లో వచ్చిన గీత గోవిందం ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది.

మరలా ఆ రేంజ్ హిట్ ఆయనకు పడలేదు. ఫ్యామిలీ స్టార్ పై విజయ్ దేవరకొండ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. గీత గోవిందం తెరకెక్కించిన పరశురామ్ ఈ చిత్ర దర్శకుడు కావడంతో కాంబినేషన్ మీద కూడా హైప్ ఏర్పడింది. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ సైతం ఆకట్టుకుంది. దానికి తోడు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దిల్ రాజు విపరీతంగా మూవీని ప్రమోట్ చేశారు. వరుస ఇంటర్వ్యూలతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఫ్యామిలీ స్టార్ మూవీ పై అంచనాలు ఏర్పడగా అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగానే నడిచాయి. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీకి సోషల్ మీడియాలో పూర్తి నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. మెజారిటీ ఆడియన్స్ ఫ్యామిలీ స్టార్ ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ సీరియల్ కంటే దారుణంగా ఉంది. విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ డ్రామా ఆకట్టుకోలేదని అంటున్నారు. రొటీన్ స్టోరీ, రిపీటెడ్ సీన్స్ తో దర్శకుడు పరశురామ్ విసుగుపుట్టించాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కథ, కథనాల్లో అసలు పట్టు లేదు. ఎమోషన్స్ ఏమాత్రం పండలేదు. మ్యూజిక్ కూడా సినిమాకు మైనస్. సాంగ్స్ పర్లేదు కానీ బీజీఎమ్ దారుణంగా ఉందని ట్వీట్స్ చేస్తున్నారు. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు అలరిస్తాయి. విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్, మృణాల్ ఠాకూర్ గ్లామర్ మాత్రమే అలరించే అంశాలు. ఫ్యామిలీ స్టార్ కథకు ఇచ్చిన ముగింపు కూడా మెప్పించలేదని అంటున్నారు. సోషల్ మీడియా జనాల కామెంట్స్ ప్రకారం విజయ్ దేవరకొండకు మరోసారి నిరాశ తప్పదట.

RELATED ARTICLES

Most Popular