Bangarraju Review: 2022 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘బంగ్రారాజు’ పండుగకు ఫర్ ఫెక్ట్ సినిమా అనిపించుకుంది. ‘సొగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సిక్వెల్ వచ్చిన ‘బంగార్రాజు’ ఈసారి సినీప్రియులను అలరించిందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
మూవీ: బంగార్రాజు.. విడుదల తేది : 14 జనవరి 2022
కథ, మాటలు, దర్శకత్వం: కల్యాణ్ కృష్ణ కురసాల
స్క్రీన్‌ప్లే: సత్యానంద్, నిర్మాత: నాగార్జున అక్కినేని
నటీనటులు: కింగ్ నాగార్జున, అక్కినేని నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, నాగబాబు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు
కెమెరా: జె.యువరాజ్, ఎడిటింగ్: విజయ్ వర్ధన్.కె
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్, నిర్మాణ సంస్థలు: అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్
కథనం..
కథలోకి వస్తే ‘సోగ్గాడే చిన్నినాయానా’ ఎక్కడైతే ముగుస్తుందో అక్కడి కథ ప్రారంభమవుతుంది. బంగార్రాజు(నాగార్జున) స్వర్గంలో రంభ, ఊర్వసి, మేనకాలతో ఎంజాయ్ చేస్తుంటాడు. కొన్నాళ్ళకి తన భార్య సత్యమ్మ(రమ్య కృష్ణ) కూడా చనిపోయి బంగార్రాజు వస్తుంది. అక్కడ తన మనవడు నాగ చైతన్య(చిన బంగార్రాజు) ఎలా ఉన్నాడని దిగులు పడుతూ ఉంటుంది. చిన్న బంగార్రాజు అచ్చు తాతలాగే జీవితం సాగిస్తున్నాడని, జీవితంపై శ్రద్ధ పెట్టడం లేదని.. నువ్వెళ్ళి మార్చమని సత్యమ్మ బంగార్రాజుకి చెబుతుంది. ఇక అక్కడి నుంచి కథను వెండితెరపై చూడాల్సిందే..!
ప్లస్ పాయింట్స్..
నాగ చైతన్య కొంటె పాత్రలో చాలా సూపర్బ్ గా చేసాడు. తమ ఫామిలీకి ఉన్న ఒక రొమాంటిక్ మార్క్ తనలోనూ ఉందని బంగార్రాజుతో చైతూ నిరూపించాడు. పలు కామెడీ సీన్స్ మంచి రొమాంటిక్ సీన్స్ సహా ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి పెర్ఫామెన్స్ చూపించాడు. అలాగే లుక్స్, బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
నాగ్ విషయానికొస్తే అంతా చైతూ వెనకుండి నడిపిస్తాడు. మంచి నటనతో ఆకట్టుకున్నాడు.చైతూ తో కలిపి ఉండే సన్నివేశాలు అక్కినేని ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇస్తాయి. నాగ్ లుక్స్ తన పాత్రకు మంచి ఎసెట్ అయింది. హీరోయిన్ కృతి శెట్టి పల్లెటూరి అమ్మాయిగా ఎనర్జిటిక్ రోల్ చేసింది. చైతూతో స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. ఈ సినిమాలో మరింత అందంగా కన్పించడంతోపాటు కామెడీ పండించింది.
స్పెషల్ సాంగ్ లో కన్పించిన ఫరియా ఆడియన్స్ మరింత జోష్ ని తెచ్చింది. వెన్నెల కిషోర్, రావు రమేష్ రమ్యకృష్ణ, నాగబాబు తదితరులు పాత్రకు మేరకు న్యాయం చేశారు. ఎంటర్ టైన్మెంట్ గా సాగే కథనం, ఇంటర్వెల్ సీన్, యాక్షన్ ఎపిసోడ్స్, పల్లెటూరు నేపథ్యం ‘బంగార్రాజు’ను కలర్ పుల్ గా చూపించింది.
మైనస్ పాయింట్స్..
ఫస్ట్ హాఫ్ అంత ఆసక్తిగా అనిపించదు. మొదట్లో కొంత ఇంట్రెస్ట్ గా అనిపించగా తర్వాత సో సోగానే అనిపించక మానదు. పాత కథలాగే అనిపిస్తోంది. ఎమోషనల్ కంటెంట్ కూడా చాలా తక్కువే ఉంది. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి స్కోప్ ఉన్న దానిని అంతగా వాడుకోలేదు. ఇక సినిమా నిడివి కూడా కొంచెం ఎక్కువయ్యినట్టు అనిపిస్తుంది.
టెక్నికల్ టీం..
నిర్మాణ విలువలు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అనుప్ రూబెన్స్ సంగీత దర్శకుడు సినిమాకి అడ్వాంటేజ్. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచాయి. యువరాజ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డైలాగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకున్నాయి. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో విజయవంతమయ్యాడు. ఈ సీక్వెల్ ని మెప్పించేలా ప్లాన్ చేశాడు.
తీర్పు..
ఈ సంక్రాంతికి పండుగకు ‘బంగార్రాజు’ ఫర్ ఫెక్ట్ సినిమా అనిపించుకుంటుందనే చెప్పాలి. నాగ్, చైతన్య, నటునటుల ఫార్మమెన్స్, మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉండటం తప్పించి సినిమా అంతా బాగానే ఉందనే చెప్పొచ్చు.
Oktelugu రేటింగ్ : 2.75/5