Bangarraju: బంగార్రాజు’ సెన్సార్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే ?

Bangarraju: అక్కినేని నాగార్జున ఎంతో ముచ్చట పడి చేసిన సినిమా ‘బంగార్రాజు’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సినిమా 2 గంటల 40 నిమిషాల నిడివి ఉంది. ఇక ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేస్తూ.. వాళ్ళ స్టైల్ లో ఒక రివ్యూ కూడా ఇచ్చారు. ఇంతకీ సెన్సార్ సభ్యులు చెప్పిన రివ్యూలో హైలెట్ […]

Written By: Neelambaram, Updated On : January 11, 2022 5:16 pm
Follow us on

Bangarraju: అక్కినేని నాగార్జున ఎంతో ముచ్చట పడి చేసిన సినిమా ‘బంగార్రాజు’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సినిమా 2 గంటల 40 నిమిషాల నిడివి ఉంది. ఇక ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేస్తూ.. వాళ్ళ స్టైల్ లో ఒక రివ్యూ కూడా ఇచ్చారు. ఇంతకీ సెన్సార్ సభ్యులు చెప్పిన రివ్యూలో హైలెట్ పాయింట్స్ ఏమిటంటే..

 

Bangarraju

‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా ఎక్కడైతే ముగిసిందో.. అక్కడ నుంచి ‘బంగార్రాజు’ సినిమా మొదలవుతుందట. ఇక “నాగార్జున ‘బంగార్రాజు’ పాత్రలో అద్భుతంగా నటించాడు అని, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో నాగ్ నిజంగా మెస్మరైజ్ చేసాడని.. ఇక నాగార్జునకి పోటీగా నాగ చైతన్య కూడా చాలా బాగా నటించాడని సెన్సార్ సభ్యులు చెప్పుకొచ్చారు.

Also Read:  కరోనా ఖాతాలో మరో బ్యూటిఫుల్ హీరోయిన్ !

మెయిన్ గా ఈ సినిమాలోని ప్లాష్ బ్యాక్ లో నాగార్జున – రమ్యకృష్ణ పాత్రల చుట్టూ సాగే సీన్స్ చాలా బాగున్నాయట. రమ్యకృష్ణ ఇరవై ఏళ్లు వెనక్కి పోయి ఈ సినిమాలో నటించినట్లు ఉందని.. అంత గ్లామరస్ గా అలాగే అంత ఈజ్ తో ఈ సినిమాలో రమ్యకృష్ణ నటించిందని సెన్సార్ రివ్యూ చెబుతుంది.

అలాగే కృతి శెట్టి గ్లామర్ కూడా హైలైట్ గా ఉందట. ఇక ‘బంగార్రాజు’ మనవడు చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య ఈ సినిమాలో కనిపించాడని.. రొమాన్స్ లో ‘బంగార్రాజు’ను చిన్న ‘బంగార్రాజు’ మించిపోయాడని రివ్యూ వచ్చింది సెన్సార్ సభ్యులు నుంచి. ఏది ఏమైనా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఆకట్టుకునేలా ఉంది.

Also Read:  సమంత డైలీ లైఫ్ ఎలా ప్రారంభం అవుతుందో తెలుసా?

Tags