Aavesham Review: వైవిద్యమైన కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు చేయడంలో ఫాహాద్ ఫజిల్ ముందు వరుసలో ఉంటాడు. మలయాళం లో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈయన ఇప్పుడిప్పుడే అన్ని భాషల్లో సినిమాలను చేస్తూ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఈయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అందులో చాలా వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది అని ప్రేక్షకుడికి ఒక నమ్మకం కలిగేలా చేసుకున్న నటుడు..ఇక పాత్ర లో కొత్తదనం లేకపోతే ఆయన సినిమాని ఒప్పుకోడు…ఇక తెలుగులో వచ్చిన పుష్ప సినిమాతో తెలుగు వాళ్లకు బాగా పరిచయమైన ఈయన ‘ ఆవేశం ‘ అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఓటిటిలోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే చదువుకునే స్టూడెంట్స్ అందరూ ఎలా అలచిస్తారో అలాంటి ఒక కథ నే ఇది… అజు ( హిప్ స్టార్), బిబి ( మిథున్ జై శంకర్), శంతన్(రోషన్ షానవాజ్) అనే ముగ్గురు స్టూడెంట్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడం కోసం కేరళ నుంచి బెంగళూరుకి వస్తారు. ఇక అందులో భాగంగానే కాలేజీ హాస్టల్లో ఉండి చదువుకుంటే అక్కడ ఫ్రీడమ్ అయితే ఉండదనే ఉద్దేశ్యం తో బయట హాస్టల్లో ఉంటూ చదువుకుంటారు. అయితే ఒకరోజు వీళ్ళను కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ చేస్తారు. ఇక దానితో కాలేజీలో వాళ్ళు చేసిన ర్యాగింగ్ ని తట్టుకోలేని వీళ్ళు ముగ్గురు వాళ్ళకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతో లోకల్ లో ఎవరైనా రౌడీ ఉన్నారేమో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా వీళ్ళు వెతికే క్రమంలో వీళ్ళకి రంగ ( ఫాహాద్ ఫజిల్) దొరుకుతాడు. ఇక అతన్ని కాలేజీలోకి తీసుకెళ్లి సీనియర్స్ కు వార్నింగ్ ఇప్పిస్తారు. ఇక దాంతో అప్పటి నుంచి వీళ్ళు ముగ్గురు రంగ మనుషులని చెప్పి కాలేజీలో అందరూ వీళ్లకు భయపడుతూ వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తు ఉంటారు.
ఇక దాన్ని హీరోయిజంగా భావించిన వీళ్ళు ముగ్గురు చదువుకు ఎగనామం పెట్టి ఎంజాయ్ చేయడానికి అలవాటు పడిపోతూ ఉంటారు. దాంతో వీళ్ళు ముగ్గురు అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయిపోతారు. ఇక ఇదే క్రమం లో కాలేజీ డైరెక్టర్ పిలిచి వీరికి ఆఖరి అవకాశంగా ఒక ఛాన్స్ ఇచ్చి బాగా చదువుకునే విధంగా ఉంటే ఇక్కడ ఉండండి, లేకపోతే కాలేజీ నుంచి వెళ్లిపోండి అని చెబుతాడు. ఇక దాంతో ఎలాగైనా సరే వీళ్ళు బాగా చదివి మళ్ళీ పాస్ అవ్వాలనే ఉద్దేశాన్ని పెట్టుకొని రంగ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. కానీ రంగ మాత్రం వీళ్లను వదిలిపెట్టకుండా వీళ్లతోనే కలిసి ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి క్రమంలో వీళ్ళు రంగని ఎలా వదిలించుకున్నారు. రంగా వీళ్ళతో ఎందుకు ఉండాలనుకుంటున్నాడు. రంగని వీళ్ళు ఏ విధంగా మోసం చేశారు అనే విషయాలు మీకు తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని మీరు చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా దర్శకుడు అయిన ‘జీతూ మాధవన్’ ఈ సినిమాని మొదటి నుంచి కూడా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో నడపడానికే ప్రయత్నం చేశాడు. అయితే ప్రతి సీన్ ను తనదైన రీతిలో ముందుకు నడిపించాడు. అయితే గ్యాంగ్ స్టర్ కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక కొత్త కోణంలో ఈ సినిమాని నడిపించిన విధానం అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కథపరంగా చూసిన కూడా ఈ కథ చాలా వైవిధ్యాన్ని సంతరించుకున్నది కావడం విశేషం.. అలాగే ట్రీట్మెంట్ లో దర్శకుడు అనుసరించిన విధానం అయితే చాలా ప్లస్ అయింది. కొన్ని సీన్లు రొటీన్ గా అనిపించినప్పటికి అందులో ట్రీట్మెంట్ చాలా కొత్తగా రాసుకోవడం వల్ల సినిమా మీద ఆటోమేటిగ్గా ఇంట్రెస్ట్ అయితే పెరుగుతూ వస్తుంది. అయితే గ్యాంగ్ స్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫాహాద్ ఫాజిల్ వ్యవహరించిన తీరుగానే ఆయన హావ భావాలు గానీ ప్రతి ఒక్కరికీ నవ్వు తెప్పిస్తాయి.
ఇక నిజానికి ఆయన ఆహార్యం చాలా కామెడీగా ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో దర్శకుడు అనుసరించిన విధానం చాలా ఫ్రెష్ గా అనిపించింది. అయితే ఇంటర్వెల్ తర్వాత స్లో నరేషన్ తో సినిమా సాగడం అనేది సగటు ప్రేక్షకుడికి బోర్ కొట్టేస్తుంది. ఒక గ్యాంగ్ స్టర్ ఎలా ఉండాలో ఫజిల్ ను అలాగే ప్రజెంట్ చేశారు. కానీ ఆ పాత్ర కు ఉన్న లిమిటేషన్స్ అక్కడక్కడ క్రాస్ అవుతూ వచ్చాయి. క్యారెక్టరైజేశన్ డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆ క్యారెక్టర్ కి ఇచ్చిన కొన్ని లిమిటేషన్స్ దాటి ఆ పాత్రలు ప్రవర్తించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఈ సినిమా మొత్తాన్ని ఫాహాద్ ఫజిల్ ఒక్కడే నడిపించాడు. నిజానికి తను చూపించిన హావభావాలన్నీ ప్రతి ప్రేక్షకుడి చేత నవ్వులు పూయించడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుడి కళ్ళనుండి కన్నీళ్లు కూడా రప్పించే విధంగా ఆయన నటన ఉందనే చెప్పాలి. నిజానికి ఇలాంటి నటులు చాలా అరుదుగా ఉంటారు. ఎలాంటి హావ భావాలనైనా వితిన్ సెకండ్స్ లో పండించే కెపాసిటీ ఉన్న నటుడని ఆయన మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు… హిప్ స్టార్, మిథున్ జై శంకర్,రోషన్ షానవాజ్ లా నటన కూడా వాళ్ళ పరిధి మేరకు బాగా నటించారు. ఇక కొన్ని సీన్లల్లో వీళ్లు కనబరిచిన నటన ఆ సీన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడంలో చాలావరకు హెల్ప్ అయ్యాయి. నిజానికి ఫాహాద్ ఫజిల్ లాంటి ఒక గొప్ప నటుడు ఎదురుగా ఉన్నప్పుడు నటించడం అంటే చాలా కష్టం..కానీ వీళ్ళు అలవోకగా నటించడం లో ఆయనతో పోటీపడ్డారనే చెప్పాలి. ఇక మిగిలిన క్యారెక్టర్లలో చేసిన ప్రతి ఒక్కరు వాళ్ల లిమిటేషన్స్ ను గుర్తుంచుకొని ఎంతవరకు యాక్టింగ్ చేయాలో అంతవరకు మాత్రమే చేసి సినిమాకి చాలా వరకు హెల్ప్ అయ్యారు…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికొస్తే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్ట్ అయిన సుశీల్ శ్యామ్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. కొన్ని సీన్లని ఎలివేట్ చేయడంలో ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది చాలా వరకు హెల్ప్ అయింది. అయితే కొన్ని ఎమోషన్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ అనేది కొంతవరకు తగ్గినట్టుగా అనిపించిన కూడా ఆ సీన్లు ప్రేక్షకులకు రీచ్ అవ్వడంలో మాత్రం హెల్ప్ అయ్యాయనే చెప్పాలి… కానీ ఇంకొంచెం బ్యాగ్రౌండ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉంటే ఈ సినిమా మరొక లెవల్ లో ఉండేది… ఇక సినిమాటోగ్రాఫర్ సమీర్ తాహిర్ అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాకి చాలా రిచ్ లుక్ అయితే తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఫాహాద్ ఫజిల్ నటించిన కొన్ని సీన్లలో ఆయనను డిఫరెంట్ షాట్స్ లో చూపిస్తూ గ్యాంగ్ స్టర్ అంటే ఎలా ఉండాలో దాన్ని సరిగ్గా పొట్రె చేసే విధంగా ఆ షాట్స్ ని కూడా అలాగే డిజైన్ చేసుకున్నాడు…
ఇక ఎడిటర్ వివేక్ హర్షన్ చాలా బాగా ఎడిటింగ్ చేసినప్పటికీ కొన్ని సీన్లు మాత్రం లాగ్ అయ్యాయి. వాటిని కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్లు లాగైనట్టుగా అనిపించాయి. అదొక్కటి కనుక కరెక్ట్ గా షార్ప్ ఎడ్జ్ లో కట్ చేసి ఉంటే ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బాగా కుదిరేది… ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నదాంట్లో చాలా బాగా ఉన్నాయనే చెప్పాలి…
ప్లస్ పాయింట్స్
ఫాహాద్ ఫజిల్
కథ
కొన్ని ఎమోషన్ సీన్స్
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ లో సీన్స్ కొంత వరకు బోర్ కలిగించాయి…
కథలో ట్విస్ట్ లు లేకపోవడం…
రేటింగ్
ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.5/5
చివరి లైన్
ఫహద్ ఫజిల్ యాక్టింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు…