105 Minutes Movie Review : ‘105 మినిట్స్’ సినిమా రివ్యూ.. హిట్టా? ఫట్టా?

కళ్లు మూసి తెరిచేలోగా అడవిలో ప్రత్యక్షమవుతుంది. ఆ తరువాత కాసేపటి తరువాత గొలుసులతో బంధించి ఉంటుంది. మధ్య మధ్య లో ఆమెను భయపెడుతున్నట్లు కొన్ని వాయిస్ లు వినిపిస్తాయి.

Written By: Chai Muchhata, Updated On : January 26, 2024 1:11 pm

105 movie review

Follow us on

105 Minutes Movie Review :  కాలం మారుతున్న కొద్దీ ప్రజల అభిప్రాయాలు మారుతున్నాయి. వారికి అనుగుణంగా.. వారికి నచ్చే విధంగా కొందరు కొత్తరకంగా సినిమాలు తీస్తున్నారు. కొత్త అనుభూతిని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో నడిచచే ఓ సినిమా వచ్చింది. అదే ‘105 మినిట్స్’. ఈసినిమా ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఒక అమ్మాయి తప్ప ఎవరూ కనిపించరు. మరి ఈ సినిమాను ఎలా తీశారు? అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. మరి ఆ సినిమా ఎలా ఉందో చూద్దామా..

నటీ నటులు:
హన్సిక

సాంకేతిక కార్యవర్గం:
డైరెక్టర్: రాజు దుస్సా
నిర్మాత: బొమ్మక్ శివ
సంగతం: శ్యామ్
కెమెరా: కిషోర్ బోయిదాపు

కథ:
ఈ సినిమాలో ఒకే పాత్ర కాబట్టి సినిమా మొత్తం ఆ పాత్ర చూట్టే తిరుగుతుంది. ఓ పని మీద బయటకు వెళ్లిన జాను (హన్సిక) తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంది. అయితే ఇంట్లోకి రాగానే ఏదో అదృశ్య శక్తి ఆమెను వెంటాడుతుంది. అలా నడుచుకుంటూ వెళ్లిన తరువాత బాత్రూంలోకి వెళ్లి బాత్ టబ్ లో కూర్చుంటుంది. కళ్లు మూసి తెరిచేలోగా అడవిలో ప్రత్యక్షమవుతుంది. ఆ తరువాత కాసేపటి తరువాత గొలుసులతో బంధించి ఉంటుంది. మధ్య మధ్య లో ఆమెను భయపెడుతున్నట్లు కొన్ని వాయిస్ లు వినిపిస్తాయి. ఇంతకీ జానును భయపెట్టెది ఎవరు? ఆమెను ఇంతలా హరాస్ మెంట్ చేయడానికి కారణమేంటి? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
హర్రర్ సినిమా కాకపోయినా ఆ ఫీల్ తెప్పించే విధంగా సినిమా సాగుతుంది. పాత్ర ఒక్కటే కాబట్టి సినిమా మధ్యలో బోర్ అనిపిస్తుంది. కానీ భయపెట్టే సీన్లు ఉండడంతో కాస్త కొత్తదనం కనిపిస్తుంది. అయితే విజువలైజేషన్ ఆకట్టుకుంటుంది.ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి సినిమా టీం కాస్త కష్టపడిందనే తెలుస్తోంది. సీన్ తరువాత సీన్ ఎలా ఉంటుంది? అనేది ఎగ్జైట్మెంట్ గా ఉంటుంది. కానీ కథ పూర్తయ్యే లోపు క్లారిటీ ఇవ్వడంతో బాగా అనిపిస్తుంది. కానీ ఈ మూవీని దేనిని ఉద్దేశించి తీశారో అనేది మాత్రం తెలియదు.

హన్సిక ఎలా నటించిందంటే?
గ్లామర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక.. ఆ తరువాత ఎలాంటి పాత్ర చేయడానికి రెడీ అంటోంది. పెళ్లయిన తరువాత హన్సిక హీరోయిన్ ఓరియెంటేడ్ పాత్రలపై ఇంట్రెస్ట్ పెడుతోంది. 105 మినిట్స్ లో హన్సిక చక్కగా నటించింది. ఒక అమ్మాయికి ఎలాంటి భయాలు ఉంటాయో హన్సిక తన నటనతో చూపించింది. హర్రర్ సినిమాల్లో నటించడం హన్సిక కు కొత్తేమీ కాదు. ఆ అనుభవంతోనే ఈసినిమాకు న్యాయం చేసిందని చెప్పొచు.

సాంకేతికి కార్యవర్గం:
పలు పాత్రలు ఉండే సినిమాలను చూపించడం కామన్. కానీ ఒక పాత్రతో 2 గంటల సినిమా తీయడం అంటే మాములు విషయం కాదు. కానీ ఆ విషయాన్ని కొత్త డైరెక్టర్ రాజు దుస్సా అనుకున్నట్లే చూపించగలిగాడు. ఈ సినిమాకు కెమెరా పనితీరు అద్భుతం అని చెప్పొచ్చు. కిషోర్ బోయిదాపు తన పనితనాన్ని చూపించాడు. బ్యాగ్రౌండ్ సౌండ్ తో సామ్ భయపెట్టాడు. మొత్తంగా ఒక్క పాత్రతో రెండు గంటల సినిమాను తీసి అందరికీ కొత్త అనుభూతిని కల్పించారు.

రేటింగ్: 5/2.5