https://oktelugu.com/

Movie personalities : సిఎం ను కలిసిన సినీ పెద్దలు…రేవతి కేసు విషయం లో అల్లు అర్జున్ కి ఉపశమనం దొరికినట్లేనా..?

మొదటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీకి రాజకీయ నాయకులకు మధ్య మంచి సంబంధాలు అయితే ఉండేవి. ఇక సినిమాకు సంబంధించిన రాయతీల విషయంలోగాని టిక్కెట్ల రేట్లు పెంపు విషయంలో గాని తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి చాలా అనుకూలంగా ఉంటుంది.. మరి ఇప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చినట్టుగా కనిపిస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : December 26, 2024 / 01:29 PM IST

    Movie personalities

    Follow us on

    Movie personalities : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇదిలా ఉంటే రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి ని కలవడానికి గత రెండు మూడు రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎట్టకేలకు వల్ల ప్రయత్నం అయితే సఫలం అయిందనే చెప్పాలి… ఇక బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ లో సినిమా ఇండస్ట్రీలో ఉన్న బడా నిర్మాతలు,డైరెక్టర్లు, హీరోలు కలిసి ఆయనతో మీటింగ్ ని ఏర్పాటు చేశారు. మరి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనని వాళ్లందరికి సీసీటీవీ పుటేజ్ ద్వారా చూపించి దీనికి గవర్నమెంట్ ది ఎలా తప్పు అవుతుంది అంటూ కొన్ని ఆసక్తికరమైన మాటలైతే మాట్లాడాడు… ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మొదటి నుంచి కూడా సినిమా టికెట్ల రేట్ పెంపు విషయంలో గానీ, బెనిఫిట్ షోస్ విషయంలో గానీ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటూ వస్తుంది. మరి ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు కూడా గవర్నమెంట్ ను తప్పు పడితే మేము చేయమంటారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలోని పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

    ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ కేసులో తనకు ఉపశమనం లభించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…నిజానికి సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో అల్లు అర్జున్ తప్పెంతుందో ప్రభుత్వం తప్పు కూడా అంతే ఉంది అంటూ కొంతమంది వాదిస్తున్నప్పటికి ఇక జరిగిపోయిన దాని గురించి డిస్కషన్ అనవసరం జరగాల్సిన విషయాలను చూసుకుంటే మంచిదని ఇంకొంతమంది కామెంట్స్ చేస్తూన్నారు.

    ఇక మొత్తానికైతే రేవంత్ రెడ్డిని తెలుగు సినీ ప్రముఖులు కలిసి సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా మార్చుకోవాలనే విధంగా మీటింగ్ లో ప్రయత్నం అయితే చేశారు…మరి ఈ ప్రయత్నాలు సఫలం అవుతాయా రాబోయే సినిమాల విషయంలో బెనిఫిట్ షోస్ కి అవలేబిలిటీ ఉంటుందా? ఒకవేళ ఉన్నా కూడా వాటికి ఉండే నియమాలు నిబంధనలు ఏంటి మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది…

    ఇక ఇప్పుడు సంక్రాంతి సినిమాల విషయంలో బెనిఫిట్ షోస్ లేకపోతే మాత్రం ఆ సినిమాలు దారుణంగా కలక్షన్స్ ని లాస్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ముందుగా ఆ సినిమాల పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది…