Mahesh Babu- Mehar Ramesh: టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఊపు ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..బ్రహ్మోత్సవం మరియు స్పైడర్ వంటి డిజాస్టర్ సినిమాల తర్వాత ఆయన ముట్టుకున్నా ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్స్ గా నిలిచాయి..ఈమధ్య ఆయన టైం ఎలా ఉంది అంటే యావరేజి టాక్ వచ్చినా కూడా సూపర్ హిట్ అయిపోయి వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అవలీలగా దాటేస్తుంది..అలాంటి స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

ఈ సినిమా పూర్తి అవ్వగానే రాజమౌళితో తో మరో సినిమా చెయ్యబోతున్నాడు..వచ్చే ఏడాదిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది..ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ముందుకి దూసుకుపోతున్న మహేష్ బాబు ఫాన్స్ కి ఇప్పుడు ఒక డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్న డైరెక్టర్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.
ఆయన మరెవరో కాదు..మన శక్తి మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్..ఈయన కెరీర్ లో ప్రభాస్ తో తీసిన బిల్లా సినిమా మినహా..మిగిలినవన్నీ ఎంత గొప్ప కళాకండాలు అనేది అందరికి తెలిసిందే..కంత్రి, శక్తి, షాడో ఇత్యాది డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు తీసిన ఈయన తన కెరీర్ కి ఎప్పుడో శుభం కార్డు తన చేతుల మీదుగానే వేసేసుకున్నాడు..కానీ ఇతగాడికి చిరంజీవి మరియు మహేష్ బాబు వంటి హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉంది..చిరంజీవి కుటుంబానికి మెహర్ రమేష్ బంధువు కూడా..ఆ చొరవతోనే మనోడి ట్రాక్ రికార్డు తెలిసి కూడా చిరంజీవి అతని దర్శకత్వం లో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు..అదే ‘భోళా శంకర్’.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది ఈ చిత్రం..అంతే కాకుండా ఆయన మహేష్ బాబు తో కూడా ఒక సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడట..ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా మెహర్ రమేష్ ఈ విషయాన్నీ వెల్లడించాడు..ఆయన ఎప్పుడైతే ఇది చెప్పాడో అప్పటి నుండి మహేష్ బాబు ఫాన్స్ ‘మహాప్రభో! మా హీరో దరిదాపుల్లోకి రాకు..మమల్ని వదిలేయ్’ అంటూ మెహర్ రమేష్ ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో ట్వీట్స్ వేస్తున్నారు.