Chiranjeevi Venkatesh Movie: మన టాలీవుడ్ సీనియర్ హీరోలు అయినా చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున మరియు వెంకటేష్ వంటి వారు ఇప్పటి వరుకు కలిసి మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యలేదు..ఈ నలుగురు హీరోలు వ్యక్తిగతంగా మంచి స్నేహితులే అయ్యినప్పటికీ కూడా ఎందుకో వీళ్ళు ఇన్ని దశాబ్దాలు ఇండస్ట్రీ లో ఉంటున్న కూడా ఒక్కసారి కూడా కలిసి సినిమా చెయ్యలేదు..బహుశా వీరి ఇమేజి లను బాలన్స్ చేస్తూ ఇన్ని రోజులు డైరెక్టర్లు సరైన కథతో వీళ్ళ దగ్గరకి రాకపోయాయి ఉండొచ్చు..కానీ ఇప్పుడు నేటి తరం స్టార్ హీరోలు సైతం మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యడానికి ఏలింది భేదభావాలు లేకుండా ముందుకి వస్తున్నారు..ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి మాస్ స్టార్ హీరోలతో #RRR సినిమా తీసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు..ఈ సినిమా ఇచ్చిన ఉత్తేజం తో ప్రముఖ దర్శక నిర్మాతలు ఇప్పుడు మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యడానికి క్యూ కట్టేస్తున్నారు.

ఇప్పుడు త్వరలో మరో క్రేజీ మల్టీస్టార్ర్ర్ మూవీ కి సంబంధించిన ప్రకటన అతి త్వరలో రాబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇక అసలు విషయానికి వస్తే ప్రముఖ యువ దర్శకుడు వెంకీ కుడుముల తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అనే వార్త గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా లో మరో హీరో కూడా ఉండడానికి ఫుల్ గా స్కోప్ ఉంది అట..ఆ పాత్ర ని విక్టరీ వెంకటేష్ తో చేయించాలి అనే ప్లాన్ ఉన్నాడట వెంకీ కుడుముల..వెంకటేష్ అంటేనే మల్టీస్టార్ర్ర్ సినిమాలకు పెట్టింది పేరు లాంటోడు..ఇప్పటి వరుకు ఆయన నేటి జనరేషన్ స్టార్ హీరోలు అయినా పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు వంటి వారితో మల్టీస్టార్ర్ర్ సినిమాలు చేసాడు కానీ..తన జనరేషన్ లో ఉన్న హీరోలతో మాత్రం చెయ్యలేదు..ఇప్పుడు ఆయన కనుక ఈ సినిమాని ఒప్పుకుంటే తోలి సారి మన ముందు జనరేషన్ స్టార్ హీరోలు కలిసి చేస్తున్న మొట్టమొదటి సినిమాగా నిలుస్తుంది.

ఇప్పటికే ఈ కథని చిరంజీవి కి వినిపించగా ఆయన ఎంతగానో నచ్చి ఈ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు అట..మరి మరో హీరో పాత్రకి ఎవరిని అనుకుంటున్నావు అని చిరంజీవి
డైరెక్టర్ ని అడగగా ‘ వెంకటేష్ గారిని అనుకుంటున్నాను సార్’ అని చెప్పాడట వెంకీ కుడుముల..’సూపర్ ఛాయస్..ఒక్కసారి వెంకటేష్ ని కలిసి స్టోరీ చెప్పు..ఆయన ఒప్పుకుంటే ఈ సినిమాని చేద్దాం’ అంటూ చెప్పాడట చిరంజీవి..మరి ఈ క్రేజీ కాంబినేషన్ కార్య రూపం దాల్చి సెట్స్ మీదకి వెళ్తుందో లేదో చూడాలి..చిరంజీవి మరియు వెంకటేష్ కి మొదటి నుండి ఎంతో మంచి సన్నిహిత్య సంబంధం ఉంది..రామ్ చరణ్ కూడా పలు సందర్భాలలో నాన్నగారి తర్వాత మా ఇంట్లో అందరూ వెంకటేష్ గారిని బాగా అభిమానిస్తారు అని చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇద్దరి హీరోల మధ్య అంత రిలేషన్ ఉండడం తో ఈ ప్రాజెక్ట్ పక్కాగా సెట్స్ పైకి వెళ్తుంది అనే నమ్మకం తో ఉన్నారు ఫాన్స్..ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు.
Recommended Videos: