Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం నేడు ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. జైల్లో కూర్చుని మోనిత ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తన కుట్రలో భాగంగా సోడా సుకన్య డాక్టర్ భారతిని ఉపయోగించుకుంటుంది. ఈ క్రమంలోనే నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో భాగంగా కార్తీక్ తనతో పిల్లలు మాట్లాడటం లేదని బాధపడుతూ కూర్చుంటే సౌందర్య వెళ్లి కార్తీక్ ను ఓదారుస్తుంది.జీవితం అన్నాక కష్టాలు సుఖాలు ఉంటాయిరా పెద్దోడా అని సౌందర్య చెప్పగా ఎన్ని రోజులు మమ్మీ 1,2 రోజులు అయితే భరించవచ్చు ఇలా కష్టాలు రోజు భరించాలంటే ఎలా అంటూ బాధపడతాడు. అసలు హిమ చూడు నాగురించే ఎలా బాధ పడుతుందో.. అని చెప్పగా దీప గురించి ఆలోచించు పెద్దోడా..ఒకవైపు నువ్వు మరొకవైపు పిల్లలు బాధపడుతూ ఉంటే ఎలా తట్టుకోగలదు నువ్వు ధైర్యంగా ఉండి దీపకు ధైర్యం చెప్పు అంటూ సౌందర్య చెబుతుంది. ఇక కార్తీక్ సరే మమ్మీ రేపటి నుంచి నేను హాస్పిటల్ కి వెళ్తానని చెబుతాడు.

ఇక దీప తన కుటుంబం గురించి వస్తున్న మాటలను తలుచుకుని బాధ పడుతూ కూర్చుంటుంది. మరుసటి రోజు పిల్లలను స్కూల్ కి వెళ్లాలని హిమ తయారవుతూ అమ్మ డాడీ ఎక్కడ అని అడుగుతుంది..హాస్పిటల్ కి వెళ్ళాడు ఏంటి డాడీతో ఏం మాట్లాడాలి అని దీప అడగగా నాన్నకు సారీ చెప్పాలి అని చెబుతోంది. ఇక సౌర్య కింద పడి కుంటుతూ వస్తూ స్కూల్ కి డుమ్మా కొడుతుంది. ఇకపోతే జైల్లో మోనిత హార్ట్ ఎటాక్ వచ్చినట్టు డ్రామా ఆడుతుంది. అంతలోనే అక్కడికి పోలీసులు అందరూ వచ్చి తనని గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని చెప్పడంతో మోనిత సుకన్యకు సైగచేసి తన హాస్పిటల్ కు తీసుకు వెళ్లేలా చేస్తుంది.
ఈ క్రమంలోనే మోనిత కార్తీక్ హాస్పిటల్ కి వెళ్లగా, స్కూల్ కి వారణాసి కార్లో వెళుతున్న హిమ తన నాన్నకి సారీ చెప్పాలని హాస్పిటల్ కి వెళుతుంది. హాస్పిటల్ దగ్గర దిగి వారణాసిని వెళ్ళమని చెబుతుంది.హాస్పిటల్లో ఒకవైపు కార్తీక్ పేషెంట్ తో మాట్లాడుతుండగా మరోవైపు మోనిత భారతితో కలిసి లోపలికి వెళుతుంది. అదే సమయంలో హిమ తన తండ్రి కోసం రిసెప్షన్ దగ్గర కూర్చొని ఉంటుంది. ఇక పోలీసులు అందరూ బయటకు వెళ్ళగానే మౌనిత లేచి కూర్చుంటుంది. ఆ సమయంలోనే భారతి ఏంటి ఇదంతా మోనిత అని అడగగా నీ సహాయం కోరుతున్నానని సలహాలు చెప్పకు.అయినా ఈ తెల్ల చీరలో నేను కార్తీక్ ఎదురుగా కనబడితే ఏం బాగుంటుంది నేను చెప్పాను కదా సారీ తెమ్మని తీసుకు వచ్చావా వెళ్లి సారీ తీసుకురా అంటూ పంపుతుంది.
ఇక దీప ఇంట్లో మోనిత గురించి ఆలోచిస్తూ దిగులుగా కూర్చుని ఉండగా సౌందర్య వెళ్లి తనని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. మొదటి నుంచి నీ భర్త వల్లే నీకు కష్టాలు. నేను నీకు ఏ విధమైన సహాయం చేయలేక పోతున్నాను అంటూ బాధపడుతుంది. ఇక హాస్పిటల్లో కార్తీక్ ఒకవైపు మౌనిత మరొకవైపు అక్కడే హిమ ఉండడంతో తర్వాత ఎపిసోడ్ ఎలా ఉండబోతోందని ఆసక్తికరంగా మారింది.