Most Expensive Songs: సినిమాలకు మాత్రమే కాదు పాటల కోసం కూడా భారీ ఖర్చు చేస్తుంటారు దర్శక నిర్మాతలు. భారీ బడ్జెట్ సినిమాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటారు. సినిమాలో నాలుగు పాటలు ఉంటే.. అందులో ఒక్క సాంగ్ అయినా కోట్లలో ఉంటుంది. అలాంటి పాటలు మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా ఉన్నాయి. రాబోతున్న సినిమాల్లో కూడా అలాంటి పాటలు ఉండడం గమనార్హం. అయితే ఈ పాటలు రిలీజ్ అయిన వెంటనే మిలియన్ వ్యూస్ సంపాదించుకుంటాయి. సినిమాకంటే ముందు ట్రైలర్, పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచుతాయి. అలాంటప్పుడు సాంగ్ హిట్ అయితే సినిమా ఆల్మోస్ట్ హిట్ అవుతుంది. ఎందుకంటే పాటల వల్ల అంచనాలు పెరిగితే.. ప్రజలు థియేటర్ వరకు వెళ్లడం గ్యారంటీ.. మరీ భారీ బడ్జెట్ తో రూపొందిన పాటలు ఏంటో ఒకసారి చూసేద్దాం..
గేమ్ ఛేంజర్ సినిమాలో పాట..
దర్శకుడు శంకర్ సినిమాలు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమా అంటే బడ్జెట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా సినిమాల్లో సాంగ్స్ పై కూడా అంతే దృష్టి పెడుతాడు. ఈయన రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని ఒక పాటకు ఏకంగా రూ. 15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమా ఖర్చు దాదాపుగా కాంతార సినిమా బడ్జెట్ కు సమానం. అత్యంత ఖరీదైన పాటల్లో ఇది రెండో స్థానంలో ఉంది. ఈ పాటలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ మెరవనుంది. ఈ సాంగ్ షూటింగ్ ను న్యూజిలాండ్ లో ప్లాన్ చేశారు. దీనికి ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తే.. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
డెవిల్ సినిమా లోని పాట.. అమిగోస్ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా డెవిల్. ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కింది. ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ కోసం ఏకంగా రూ. 3 కోట్లు ఖర్చు చేశారు.అయితే ఈ మొత్తం చాలా ఎక్కువ అని ఇండస్ట్రీలో టాక్. ఇక ఈ సాంగ్ కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన సాంగ్ అని ఇండస్ట్రీలో టాక్. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు కథ, మాటలు అందించగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. బ్రిటీష్ ప్రభుత్వంలో పని చేసే ఇండియన్ స్పై రోల్ లో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో స్పెషల్ గా కనిపించారు.
ఆర్ఆర్ఆర్- నాటు నాటు పాట..
నాటు నాటు పాటను ఉక్రెయిన్ లో చిత్రీకరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భవన ప్రాంగణంలో ఈ పాటను షూట్ చేశారు. పక్కనే పార్లమెంట్ భవనం కూడా ఉంది. ఇలాంటి ప్రదేశంలో ఓ సినిమా షూటింగ్ అంటే చాలా కష్టం. అనుమతులు తీసుకోవడం కూడా చాలా కష్టమే. కానీ జెలెన్ స్కీ ఒకప్పుడు టెలివిజన్ యాక్టర్ కావడంతో తొందరగానే పర్మిషన్ ఇచ్చారట. ఈ పాటను 17 రోజుల పాటు షూట్ చేశారు. సెట్స్ లో ప్రతి రోజు 150 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. అంతే కాదు 200 మంది సాంకేతిక నిపుణులు కూడా ఈ లొకేషన్ లో హాజరయ్యారట. ఇందులో హుక్ స్టెప్ చెప్పుకోవాల్సిన స్టెప్. దీనికోసం 80 రకాల స్టెప్స్ ను కంపోజ్ చేశాక.. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అండ్ టీమ్ ఆ స్టెప్ ను ఫైనలైజ్ చేశారు. ఈ పాట కోసం దాదాపు రూ.15 కోట్లు ఖర్చు చేశారట. ముందుగా ఈ పాటను ఎర్రకోటలో షూట్ చేయాలి అనుకున్నారు. ఆ సమయానికి వర్షాకాలం అవడంతో ఇతర దేశాల్లో తీయాలి అనుకున్నారు. సెట్ అయితే సహజంగా ఉండదని.. జెలెన్ స్కీ భవనాన్ని ఎంచుకున్నారట చిత్ర యూనిట్.
పుష్ప-ఊ అంటావా మామ..
పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతోంది. ఈ సాంగ్ లో సమంత మెరిసింది. ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మామ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. ఈ పాట ఏకంగా యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ ను సంపాదించింది. చాలా కాలం తర్వాత సమంత హాట్ గా కనిపించడంతో పాటు అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటుంది కూడా. ఈ పాట కోసం కూడా మేకర్స్ ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు చేశారట. ఈ ఒక్క సాంగ్ కోసమే సమంత కోటిన్నరకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంది. దీంతో పాటు భారీ సెట్టింగ్ తో విజువల్ వండర్ గా తెరకెక్కింది పాట.
ఇక ఈ పై సినిమాలోని పాటలన్నీ.. భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే..ఈ బడ్జెట్ తో కొన్ని చిన్ని సినిమాలు పూర్తవుతాయి. కాంతార సినిమా కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇలాంటి సినిమాలు తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కుతాయి. కానీ ఈ సినిమాల్లోని పాటలు మాత్రం సినిమా బడ్జెట్ తో సమానంగా తెరకెక్కడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.