https://oktelugu.com/

అఖిల్ బాధ వర్ణనాతీతం.. బ్యాచిలర్‌ పై క్లారిటీ !

అక్కినేని అఖిల్ బాధ వర్ణనాతీతం అట. హీరో కాకముందే సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నా.. ఇంతవరకు సరైన హిట్ కొట్టలేక సతమతమవుతున్నాడు. ‘మనం’ సినిమాలో అఖిల్ చేసిన గెస్ట్ రోల్ బాగా వర్కౌట్ అయింది, ఒక విధంగా ఆ గెస్ట్ రోల్ తో అఖిల్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ఆ హైపే తన కొంప ముంచిందని అఖిల్ ఇప్పుడు తీరిగ్గా ఫీల్ అవుతున్నాడు. తన నుండి ఎక్కువ ఎక్స్ పెక్ట్ […]

Written By:
  • admin
  • , Updated On : May 24, 2021 / 03:41 PM IST
    Follow us on


    అక్కినేని అఖిల్ బాధ వర్ణనాతీతం అట. హీరో కాకముందే సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నా.. ఇంతవరకు సరైన హిట్ కొట్టలేక సతమతమవుతున్నాడు. ‘మనం’ సినిమాలో అఖిల్ చేసిన గెస్ట్ రోల్ బాగా వర్కౌట్ అయింది, ఒక విధంగా ఆ గెస్ట్ రోల్ తో అఖిల్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ఆ హైపే తన కొంప ముంచిందని అఖిల్ ఇప్పుడు తీరిగ్గా ఫీల్ అవుతున్నాడు.

    తన నుండి ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయడంతో ఆ అంచనాలను అందుకోలేక తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేయాల్సి వస్తోందని అఖిల్ డైలమాలో పడ్డాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న నాలుగో చిత్రం… “మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌”. ఎంతో అట్టహాసంగా రెండేళ్ల క్రితం ప్రారంభమైనా.. ఇంతవరకు అతీగతీ లేకుండా పోయింది. మధ్యలో కరోనా వచ్చింది అని చిత్రబృందం కహానీలు చెబుతున్నా.. ఈ సినిమా విషయంలో అనేక లొసుగులు ఉన్నాయని టాక్.

    ఎప్పుడో ఫామ్ కోల్పోయిన బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌ చేస్తోన్న ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. దాంతో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి భయపడిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ టీమ్, మొత్తానికి తమ సినిమా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే విడుదల చేస్తామని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.