Akkineni Akhil: ఎప్పటి నుంచో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో అక్కినేని అఖిల్. అఖిల్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ డైనమిక్ హీరో … ఇప్పటి వరకు సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. అఖిల్, హలో , మిష్టర్ మజ్ను చిత్రాల్లో అతని నటనకు మంచి గుర్తింపు లభించిన కలెక్షన్ల పరంగా మాత్రం విఫల మయ్యాయని చెప్పాలి. ఈ తరుణంలో ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 15న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
మహా సముద్రం, వరుడు కావలెను, పెళ్లి సందD వంటి సినిమాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది. రెండు రోజుల్లో 18 కోట్లు కొల్లగొట్టి అఖిల్ కి సూపర్ హిట్ ని అందించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథను తెరకెక్కించడంలో బొమ్మరిల్లు భాస్కర్ ఈసారి సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అఖిల్ కెరీర్ లో ఇది మర్చిపోలేని విజయంగా చెప్పుకోవచ్చు.
అయితే ఇప్పుడు తాజాగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఓటీటీ రిలీజ్ ఆహా లో నవంబర్ 12న… విడుదల కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. సోషల్ మీడియా లో వచ్చే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని… ఆన్లైన్ లో స్ట్రీమింగ్ కి ఇంకా చాలా సమయం పడుతుందని అన్నారు. ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.