
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పంథా మార్చుకున్నారు. విమర్శలకు పోకుండా నేతల ప్రతిష్టను పెంచే పనిలో పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఘనతను చాటిచెప్పేందుకు నిర్ణయించుకున్నారు. ఆయన ఇల్లును మ్యూజియంగా మార్చేందుకు నిధి ఏర్పాటు చేసి తన ఉదారతను చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సేవలను చాటిచెప్పే పనిలో ఆయన చేసిన పనులు తెలియజేసేందుకు ముందుకు కదులుతున్నారు. సమాజ హితం దామోదరం సంజీవయ్య పాటుపడిన విధం ప్రజలకు చాటిచెప్పనున్నారు.
జాతీయ కాంగ్రెస్ పార్టీకి తొలి దళిత అధ్యక్షుడు, హైదరాబాద్ అభివృద్ధికి దార్శనికుడుగా పేరు గాంచిన దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక కేంద్రంగా తీర్చి దిద్దుతామని కీలక ప్రకటన చేశారు. ఇందుకోసం రూ. కోటి తో నిధి ఏర్పాటు చేశారు. దీంతో తనలోని భక్తిని చాటుకుని సంజీవయ్య సేవలను విశ్వవ్యాప్తం చేయాలని సంకల్పించారు. సంజీవయ్యకు సంబంధించిన పలు విషయాలపై ఆసక్తికర విషయాలను ట్వీట్ చేశారు.
తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వెనుకబాటు తనాన్ని రూపుమాపడానికి ఆయన ఎనలేని కృషి చేసిన సంగతి తెలిసిందే. ఆయన రూపకల్పన చేసిన పలు సాగునీటి ప్రాజెక్టులు ఆయన పనితనానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్టు అంకురార్పణ చేసింది కూడా ఆయనే. సంజీవయ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో నిజాం భూములు సుమారు 6 లక్షల ఎకరాలను దళితులు, వెనుకబడిన వర్గాలకు పంపిణీ చేసి తనలోని గొప్పతనాన్ని చాటుకున్నారు.
దామోదరం సంజీవయ్య మరణించే నాటికి ఆయన వద్ద రూ.17 వేల నగదు, ఒక ఫియట్ కారు మాత్రమే ఉన్నాయి. అంత సాధారణ జీవితం గడిపిన ఆయన గొప్పతనాన్ని చాటిచెప్పేందుకే పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఆయన చేసిన సేవలను అందరికి తెలియజేసేందుకు పలు మార్గాలు అనుసరిస్తున్నారు. కోటి తో నిధి ఏర్పాటు చేసి దాంతో పవన్ కల్యాణ్ సంజీవయ్య సేవలను బహిర్గతం చేయనున్నారు.