Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ తెలుగు 7 ఫస్ట్ ఎపిసోడ్ ఒక విషయంలో నిరాశపరిచింది. కేవలం 14 మంది కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపారు. గతంలో ఎన్నడూ ఇంత తక్కువ మందితో షో మొదలుకాలేదు. అలాగే ఈసారి బిగ్ బాస్ కి వెళుతున్నారంటూ ప్రచారమైన కొందరు సెలెబ్స్ మిస్ అయ్యారు. గత ఆరు సీజన్స్ లో అత్యల్పంగా 19 మంది అత్యధికంగా 21 మందితో బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ చేయడమైనది.
లేటెస్ట్ సీజన్లో కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ని పరిశీలిస్తే… సీరియల్ నటుడు అమర్ దీప్, నటుడు శివాజీ, యూట్యూబర్ టేస్టీ తేజా, నటుడు గౌతమ్ కృష్ణ, నటుడు ప్రిన్స్ యావర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, ఆట సందీప్, నటి షకీలా, సింగర్ దామిని, నటి కిరణ్ రాథోడ్, సీరియల్ నటి ప్రియాంక జైన్, నటి రతికా రోజ్, సీరియల్ నటి శోభ శెట్టి, శుభశ్రీ ఉన్నారు.
14 మందితో 15 వారాలు షో నడపడం కష్టం. అందుకే మరికొందరు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తారనే సమాచారం ఉంది. ఈ మేరకు కొన్ని క్రేజీ సెలెబ్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. 8 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళుతున్నారు. సీరియల్ నటి పూజా మూర్తి ఈ లిస్ట్ లో ఉన్నారట. తండ్రి మరణంతో ఆమె వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఆమె హౌస్లోకి వస్తున్నారట. హీరోయిన్ ఫర్జానా పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమె కూడా లిస్ట్ లో ఉన్నారట.
అలాగే అంబటి అర్జున్, యాంకర్ వర్షిణి, పవన్ సాయి రాజ్ పుత్, యాక్టర్ క్రాంతి, నిఖిల్, ఐశ్వర్య ప్రిన్సే, బోలె షవాలి ఎంట్రీ ఇవ్వనున్నారట. నిజంగా ఈ 8 మంది హౌస్లోకి వెళితే మొత్తం 22 మంది అవుతారు. ఇక ఫస్ట్ వీక్ కి 8 మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఈ ఆదివారం ఎలిమినేట్ కానున్నారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటే హౌస్లో కంటెస్టెంట్స్ సంఖ్య 21కి చేరుతుంది. అలాగే ఈసారి ఓ ట్విస్ట్ పెట్టారు. హౌస్లోకి వెళ్లినా హౌస్ మేట్ కావాలంటే పవర్ అస్త్ర గెలుచుకోవాలి…