బుల్లితెరపై రోజురోజుకు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు మరింత రసవత్తరంగా కొనసాగనుంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా తమ తల్లిదండ్రులను నిలదీస్తున్న పిల్లలకు దీప ప్రేమగా ఓ కథను చెప్పి వారిని ఓదార్చిన సంగతి మనకు తెలిసిందే. మరుసటి రోజు ఉదయం న్యూస్ పేపర్ చూసిన కార్తీక్ అందులో మోనిత తనకు, కార్తీక్ కి ఉన్న సంబంధం, తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి కార్తీక్ అంటూ ప్రచురించబడిన వార్తను చూసి చాలా కంగారు పడతాడు. ఇదే విషయాన్ని దీపకు చూపించడంతో దీప కూడా ఎంతో కంగారు పడుతుంది. ఆ సమయంలోనే సౌర్య అక్కడికి వచ్చి అందులో ఉన్నది చదివి ఇదంతా నిజమేనా అంటూ వారిని నిలదీస్తున్నట్లు కల రావడంతో కార్తీక్ టెన్షన్ పడి గట్టిగా అరుస్తాడు.

అదే సమయంలో దీప ఏం జరిగిందంటే రాగా సౌర్య ఎక్కడ అని సౌర్య కోసం వెతుకుతాడు.ఇదంతా నిజం కాదని తెలుసుకొని పేపర్ ను కింద పడేసాడు. ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన సౌందర్య ఆ పేపర్ చూసి ఎంతో కంగారు పడుతుంది. కార్తీక్ కి వచ్చిన కల నిజమే అయింది. ఆ పేపర్ ను దీపకు ఇస్తూ ఇది పిల్లలకు కనిపించకుండా దాచేయమని చెబుతుంది. కార్తీక్ ఆ పేపర్ ని కాల్చి పడేయాలని చెప్పగా దీప తన బెడ్రూమ్ కి తీసుకువెళ్లి ఇదంతా చదివి ఏడుస్తుంది.
కట్ చేస్తే జైల్లో మోనిత న్యూస్ పేపర్ చదువుతూ ఎంతో పొంగిపోతుంది. నా గురించి కార్తీక్ గురించి దీప చదివిందా లేదా.. చదివే ఉంటే అక్కడ బాంబు బ్లాస్ట్ అయ్యి ఉంటుంది. ఇలా తన గురించి వచ్చిన వార్తను చదువుతూ మురిసిపోయిన మోనితకు కార్తీక్ ను చూడాలనే కోరిక కలుగుతుంది. ఈ క్రమంలోనే ఎలాగైనా సుకన్యను సహాయం కోరి కార్తీక్ ను చూడాలని ప్లాన్ వేస్తుంది.
మరోవైపు దీప ఏడుస్తూ పేపర్ చదువుతుండగా అక్కడికి సౌర్య రావడంతో దీప కంగారుగా న్యూస్ పేపర్ ను బెడ్ కింద పెట్టి ఏంటి అని అడగగా.. నాన్నమ్మ నిన్ను వ్రతానికి తయారవమని చెప్పిందని చెబుతుంది.ఈ క్రమంలోనే దీప కార్తీక్ ఎంతో అలజడిగా అదే విషయాన్ని తలుచుకుంటూ వ్రతానికి సిద్ధమయ్యే ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఇలా వ్రతం పూర్తికాగా దీప ఇంటికి ఇద్దరు పిల్లలు వచ్చి అమ్మమ్మ తాతయ్య అంటూ వారిని పట్టుకోవడంతో అది చూసిన కుటుంబ సభ్యులు ఎవరా అని ఆశ్చర్యపోతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి కాగా తరువాత ఎపిసోడ్లో పిల్లలు ఆ న్యూస్ పేపర్ చూస్తారా? నిజానిజాలు తెలుసుకుని దీపా కార్తీక్ లను నిలదీస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.