Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం(Karthika Deepam) సీరియల్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతూ ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈ సీరియల్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతూ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత ఎపిసోడ్ లో సౌర్య న్యూస్ పేపర్ చూశాను అంటూ ప్రశ్నల పై ప్రశ్నలు దీపను అడగడం తెలిసిందే. నిజాలు తెలుసుకున్న హిమ బాధపడుతూ రోడ్డుపై ఒక బెంచ్ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక సౌర్య అన్న మాటలను దీప సౌందర్య దగ్గర చెప్పి బాధపడుతుంది. దీప మాటలు విన్న సౌందర్య మొదట షాక్ అయిన ఆ తర్వాత మనం చెబితే పిల్లలు తెలుసుకుంటారు అంటూ సౌర్యతో నేను మాట్లాడతానని చెబుతుంది.

ఇక తన వేసిన పథకం సక్సెస్ అయిందని హిమ వినెలా తాను మాట్లాడిన మాటలను గుర్తుచేసుకొని మోనిత తెగ సంబర పడుతుంది.అంతలోనే సుకన్య అక్కడికొచ్చి ఏంటి మేడం ఏమైంది అంత సంతోషంగా ఉన్నారు అని అడుగగా నువ్వు లేకపోయినా మీ వాళ్ళు నా ప్లాన్ ఎంతో సక్సెస్ చేశారు.నిజంగానే పండగ చేసుకోవాలి అంటూ చెప్పగా సోడా సుకన్య వెళ్లి రెండు సోడాలు తీసుకువచ్చి ఇద్దరు పార్టీ చేసుకుంటారు. మరోవైపు కార్తీకం క్యాబిన్ లో కూర్చొని మోనిత అన్న మాటలను పదేపదే తలుచుకుంటూ బాధపడతాడు. ఈ విషయాన్ని దీపకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. దీప కు చెబితే బాధపడుతోందని అనుకుంటాడు.
ఇక సౌందర్య సౌర్యతో మాట్లాడుతూ అన్ని విషయాలు మీకు చెప్పేది కావు కొన్ని విషయాలు చెప్పనివి కూడా ఉంటాయి. మీ డాడీ మంచోడే,కానీ ఆ మోనిత చెత్త ప్లాన్స్ వల్ల మీ డాడీని చెడ్డవాడిగా చిత్రీకరించింది ఇవన్నీ నిజాలు నమ్మవే అంటూ సౌందర్య సౌర్యకి చెబుతుంది.ఈ మాటలు విన్న సౌర్య నేను నమ్ముతాను హిమ చాలా బాధ పడుతోంది అని చెప్పగా నువ్వే నచ్చచెప్పాలి అంటూ ఆ బాధ్యతను సౌర్యకి అప్పగిస్తారు. అంతలోపు ఆదిత్య శ్రావ్య హిమను తీసుకొని ఇంటికి వస్తారు. ఏమైంది అంటూ సౌందర్య అడగగా తల నొప్పిగా ఉందని చెప్పి పైకి వెళుతుంది.పైనుంచి దీప దిగుతూ ఏమైంది అని అడగగా తనతో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది.
కిందకు వచ్చిన దీప ఏమైంది అత్తయ్య హిమకు అని అడగగా దారిలో కూర్చొని బాధపడుతుంది ఏమైంది రా అని అడిగితే నన్ను వదిలేయ్ పిన్ని అని చెబుతోంది.ఈ వయసులోనే దానికి ఏంటి ఆ మాటలు అని అడగగా దీప పిల్లలు పేపర్ చూశారు అత్తయ్య అని చెప్పడంతో షాక్ అవుతుంది. అందుకే పిల్లల దగ్గర నిజాలు దాచ కూడదని చెప్పేది అంటూ ఆదిత్య కోపంతో అరుస్తాడు. సౌందర్య నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఇక రూమ్ కి వెళ్ళిన హిమ సౌర్య హాస్పిటల్ లో జరిగిన విషయం మొత్తం చెబుతుంది. డాడీ నే బ్యాడ్ బాయ్ అంటూ ఏడుస్తుంది. డాడీ మోనిత ఆంటీని పెళ్లి చేసుకుంటానన్నాడట అని చెప్పడంతో సౌర్య అలా ఎలా చేసుకుంటాడు తప్పు కదా అంటూ ఏడుస్తూ ఉంటారు.