Pawan Kalyan: ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్లనున్న పవర్ స్టార్… క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయ పార్టీ పనులతో చాలా బిజీగా ఉన్నారు. పవన్ ప్రస్తుతం రానాతో కలిసి “భీమ్లా నాయక్” అనే సినిమాలో నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నారు. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను […]

Pawan Kalyan: ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్లనున్న పవర్ స్టార్…  క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయ పార్టీ పనులతో చాలా బిజీగా ఉన్నారు. పవన్ ప్రస్తుతం రానాతో కలిసి “భీమ్లా నాయక్” అనే సినిమాలో నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నారు. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తోంది చిత్రయూనిట్. మరో వైపు హరీష్ శంకర్, క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రాల్లో కూడా పవన్ నటిస్తున్నారు. దీంతో కుటుంబంతో గడిపేందుకు తీరికలేకుండా ఆ బిజీ షెడ్యూల్ సాగుతోంది.

power star pawan kalyan going to russia with his wife and children

అంతేకాదు కరోనా కారణంగా అతని భార్య అన్నాలెజోనోవా తన స్వదేశం రష్యాకు కూడా వెళ్లలేదు. దీంతో పవన్ ఓ పదిరోజుల పాటూ అన్ని పనులను పక్కన పెట్టి కుటుంబం కోసమే సమయం కేటాయించబోతున్నట్టు సమాచారం. భార్యతో పాటూ కొడుకు మార్క్ శంకర్, కూతురు పొలెనాలతో కలిసి క్రిస్మస్ అత్తగారింటికి వెళ్లబోతున్నారట. పవన్, అన్నా లెజోనోవాలకు 2011లో పరిచయం కాగా, 2013లో పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్‌ని పెళ్లి చేసుకున్నాక అన్నా చీరకట్టుతో, బొట్టుతో తెలుగమ్మాయిలా కనిపించేందుకు ప్రయత్నించింది. క్రిస్మస్ తో పాటూ న్యూఇయర్ వేడుకలు కూడా పూర్తయ్యాక సంక్రాంతి కల్లా తిరిగి భారత్ కు వచ్చేసే ప్లాన్ ఉందట అతని కుటుంబం. సంక్రాంతికి రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్ విడుదల కాబోతున్నాయి. మరి సంక్రాంతి బరిలో ఎవరు నెగ్గుతారో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు