Money Heist: కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతబడినప్పటి నుంచి వెబ్‌సిరీస్‌లకు మంచి డిమాండ్ ఏర్పడింది. గత సంవత్సర కాలంలో ఈ వెబ్‌సిరీస్‌ల హవా విపరీతంగా మారింది. ఎన్ని సినిమాలొచ్చినా వీటికి మాత్రం క్రేజ్ తగ్గట్లేదు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా భాషా భేదం లేకుండా అన్ని చోట్లా ప్రస్తుతం సూపర్ క్రేజ్ సంపాందించుకుంటున్నాయి వెబ్‌సిరీస్‌లు. ఈ క్రమంలోనే భారత్‌లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న స్పానిష్ వెబ్ సిరీస్ మని హైస్ట్. ఇప్పటి వరకు వచ్చిన 5 సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాబరీ నేపథ్యంలో ఎంతో రసవత్తరంగా సాగే ఈ కథలో నైరోబి, ప్రొఫెసర్, టోక్యో వంటి పాత్రలకు కోట్లాది మంది అభిమానులగా మారిపోయారు.
https://youtu.be/RLUIZFS5y0k
కాగా, తాజాగా, వెబ్ సిరీస్ సీజన్ 5 వాల్యూమ్ 2 ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. తెలుగులోనూ ఈ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠంగా సాగింది. ప్రొఫెసర్ కూడా బ్యాంక్ రాబరీ జరిగే ప్రదేశానికి వెళ్తున్నట్లు ఇందులో చూపించారు. కాగా, టోక్యో వాల్యూమ్ 1లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ప్రొఫెసర్, అతని టీమ్ రాబరీ నుంచి తప్పించుకున్నారా? లేక పోలీసుల చేతికి చిక్కారా అని తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే. డిసెంబరు 3న నెట్‌ఫ్లిక్స్‌లో వాల్యూమ్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.