ఫైనల్ స్టేజ్ లో టాప్ హీరోల సినిమాలు !

కరోనా మొత్తానికి సినీ పరిశ్రమలకే హారర్ సినిమా చూపించింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమలు ఈ ఏడాదిని వదిలేసుకున్నాయి. ఎలాగూ చూస్తుండగానే ఈ సంవత్సరం సినిమా వాళ్ళకు అత్యంత చేదు సంవత్సరంగా మిగిలిపోయింది. కరోనా జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేని కష్టంగా మిగిలిపోయింది. ఒక విధంగా సినిమా పుట్టిన దగ్గర నుండి ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని బాధ పడటం తప్ప.. ఇప్పటికీ ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థతి. ఎక్కడో చైనాలో పుట్టి […]

Written By: admin, Updated On : October 14, 2020 5:07 pm
Follow us on


కరోనా మొత్తానికి సినీ పరిశ్రమలకే హారర్ సినిమా చూపించింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమలు ఈ ఏడాదిని వదిలేసుకున్నాయి. ఎలాగూ చూస్తుండగానే ఈ సంవత్సరం సినిమా వాళ్ళకు అత్యంత చేదు సంవత్సరంగా మిగిలిపోయింది. కరోనా జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేని కష్టంగా మిగిలిపోయింది. ఒక విధంగా సినిమా పుట్టిన దగ్గర నుండి ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని బాధ పడటం తప్ప.. ఇప్పటికీ ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థతి. ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచానికే ప్రమాదకరంగా మారిన ఈ అతి చిన్న వైరస్‌.. ఎప్పటికీ పోతుందో మళ్ళీ మాములు స్థితికి సినిమా పరిశ్రమలు ఎప్పుడు వస్తాయో.. సినీ కార్మికుల బాధలు ఎప్పటికీ తీరతాయో అంతుచిక్కడం లేదని మొన్నటివరకూ తెగ బాధ పడ్డారు.

Also Read: మెగాస్టార్ చెల్లిగా ‘మెగా’ హీరోయినే ఫిక్స్ అయ్యిందా?

అయితే యాదృచ్చికమో లేక కాకతాళీయమో కానీ బాలీవుడ్ నుండి టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఇలా అన్నీ వుడ్ లకు సంబంధించిన టాప్ హీరోల సినిమాలన్నీ ఇంచుమించుగా ఫైనల్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నాయి. పైగా ఈ సినిమాలన్నీ ప్రస్తుతం సంక్రాంతిని టార్గెట్ చేసుకునే రానున్నాయి. ఎలాగూ రేపోమాపో థియేటర్లు ఓపెన్ అవ్వబోతున్నాయి. అందుకే మన తెలుగు హీరోలు కూడా సెట్స్ మీదకు వచేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పట్లో షూట్ వద్దు అని చేప్పినా పవన్ కళ్యాణ్ కూడా షూట్ కి ఓకే చెప్పాడు. అందుకే ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఇటీవలే మొదలైంది. కాకపోతే పవన్ వచ్చే వారం నుండి షూట్ లో పాల్గొంటాడు.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’కి భారీ ఆఫర్.. ‘దానయ్య’ ఇక సేఫే !

ఇప్పటికే పవన్ కళ్యాణ్ 20 రోజుల కాల్షీట్లు కేటాయించాడు ఈ సినిమాకి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేకుండా మిగిలిన ఆర్టిస్టుల పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇక రవితేజ లేటెస్ట్ మూవీ క్రాక్ ఫైనల్ షెడ్యూల్ మొన్ననే మొదలైంది. వెంకటేష్ నారప్ప సినిమా కూడా డిసెంబర్ నుండి ఫైనల్ షెడ్యూల్ మొదలుకానుంది. అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా దాదాపు ఫైనల్ స్టేజ్ లోనే ఉంది. ప్రభాస్ రాధే శ్యామ్ కూడా ఫైనల్ షెడ్యూల్ కోసమే యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఇప్పటిదాకా పనులు లేక గాల్లో దీపం అన్నట్టు చూసిన సినీ కార్మికులకు ఇప్పుడు పనులు దొరుకుతున్నాయి.