Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ హీరో కావాలని బాలయ్య ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుకుంటున్నారు. 30 ఏళ్ల మోక్షజ్ఞ ఎట్టకేలకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. అధికారిక ప్రకటన కూడా జరిగింది. హనుమాన్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ నమోదు చేసిన ప్రశాంత్ వర్మను దర్శకుడిగా ఎంచుకున్నారు. ఆయన సిద్ధం చేసిన కథ బాలయ్యకు బాగా నచ్చిందట. ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ మూవీ ఒక పార్ట్ అంటున్నారు. సోషియో ఫాంటసీ సబ్జెక్టు అట. అత్యధిక బడ్జెట్ తో విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలని ప్లాన్.
మోక్షజ్ఞ శిక్షణ కూడా తీసుకుంటున్నారు. నటన, డాన్సులు, ఫైట్స్, డైలాగ్ డెలివరీ లో రాటుదేలుతున్నాడట. బాలయ్య వారసుడిగా ఆ మార్క్ చూపించాలి. అందుకే పూర్తి సన్నద్ధమై వస్తున్నాడని కథనాలు వెలువడ్డాయి. కాగా ఈ మూవీ డిసెంబర్ 4న లాంచ్ కావాల్సిందట. స్టార్ కిడ్ డెబ్యూ మూవీ కావడంతో పూజా కార్యక్రమం కోసమే రూ. 30 లక్షల రూపాయలతో సెట్ వేశారట. అనూహ్యంగా కార్యక్రమం వాయిదా పడిందట.
ఈ క్రమంలో మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అదే సమయంలో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999లో మోక్షజ్ఞ నటిస్తున్నాడని బాలకృష్ణ అధికారిక ప్రకటన చేశారు. గతంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఇదే అని వార్తలు వచ్చాయి. బాలకృష్ణ స్వయంగా స్క్రిప్ట్ రాశారట. ఆయనే దర్శకత్వం వహిస్తారని సదరు కథనాల సారాంశం. తాజాగా బాలకృష్ణ ఆదిత్య 999 పై చేసిన ప్రకటన టాలీవుడ్ వారాల్లో ఆసక్తి రేపింది.
దాంతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఆదిత్య 999 కావచ్చు. ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ మూవీ లాంచింగ్ ఈవెంట్ ని ఎందుకు వాయిదా వేశారో బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. మోక్షజ్ఞకు అనారోగ్యం. మారిన వాతావరణం వలన ఇబ్బందిపడుతున్నాడు. అందుకే వాయిదా వేశాము. త్వరలోనే పూజా కార్యక్రమం ఉంటుంది అన్నారు.
ఆదిలోనే హంసపాదు అన్నట్లు మోక్షజ్ఞ కోసం నిర్మాత లక్షలు ఖర్చుతో చేసిన ఏర్పాటు నిరుపయోగం అయ్యింది. మరి మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ నిజంగా వాయిదా పడిందా? లేక మొత్తంగా ఆ రద్దు అయ్యిందా? అనేది తెలియదు. ప్రశాంత్ వర్మ హీరో కమ్ దర్శకుడు రక్షిత్ శెట్టితో జై హనుమాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.