Mokshagna Teja: టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి బాలయ్య బాబుకి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. నందమూరి తారక రామారావు గారి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. మాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి… ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నాడు. అఖండ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. నవంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విషయంలో ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను సాధించిన ఆయన ఇప్పుడు ఐదోవ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…
ఇక బాలయ్య బాబు విషయం పక్కన పెడితే తన నట వారసుడిగా ‘మోక్షజ్ఞ’ ను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికి ఆయన సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతు వస్తోంది. ఇక మోక్షజ్ఞ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో మోక్షజ్ఞ నటించబోతుండనే వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ ను డైరెక్ట్ హీరోగా ఎంట్రీ ఇప్పించకుండా బాలయ్య సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో ఇండస్ట్రీకి పరిచయం చేసి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని ద్వారా మోక్షజ్ఞ స్క్రీన్ అప్పీరియన్స్ ఎలా ఉంటుంది.
తన నటనలో పరిణితి ని చూపిస్తాడా? లేదా అనే విషయాలను తెలుసుకొని ఆ తర్వాత ఒక స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా మోక్షజ్ఞ ను ఇండస్ట్రీకి గ్రౌండ్ గా పరిచయం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి బాలయ్య బాబు సినిమాలో మోక్షజ్ఞ క్యారెక్టర్ ఎలా ఉంటుంది. తద్వారా అతను ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది…