Mokshagna: నందమూరి బాలయ్య సినీ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుండో ఆశ పడుతున్నారు. అయితే, మోక్షజ్ఞకు యాక్టింగ్ పై ఇంట్రస్ట్ లేకపోవడం, బాలయ్య కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండటం.. ఇన్నాళ్లు వారసుడి రాకకు ముహూర్తం కుదర్లేదు. కానీ సడెన్ గా మోక్షజ్ఞ లో మార్పు వచ్చింది. ప్రస్తుతం తన ఫిజిక్ పై మోక్షజ్ఞ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సహజంగా మోక్షజ్ఞ బాగా లావు, పైగా కాస్త పొట్టతో మొత్తానికి హీరో అయ్యే లక్షణాలు ఏ మాత్రం తనలో లేవు అన్నట్లు ఉంటాడు.
అయితే, మారిన ఆలోచన విధానం కావొచ్చు, బాలయ్య ఒత్తిడి కావొచ్చు.. మొత్తానికి మోక్షజ్ఞ తన లుక్ ను మార్చడానికి కసరత్తులు చేశాడు. ఇంకా చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో పూర్తి స్లిమ్ గా సిక్స్ ప్యాక్ బాడీ తో ఓ ఫోటో షూట్ కూడా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇదే నిజం అయితే నందమూరి ఫాన్స్ తెగ ఖుషి అయిపోతారు. గత నాలుగేళ్లుగా మా యంగ్ హీరో ఎంట్రీ అప్పుడు ఇప్పుడు అంటూ కాలక్షేపం చేసిన బాలయ్య అభిమానులకు ఈ వార్త గొప్ప శుభవార్తే.
Also Read: Suryakumar Yadav: టీమిండియా క్రికెటర్ ‘సూర్య’ప్రతాపానికి అసలు కారణం అదేనట?
ఎంతైనా నటసింహం బాలయ్య బాబు పేరు చెబితేనే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి, ఇక బాలయ్య డైలాగ్ లకు థియేటర్స్ డైనమెట్ పేలినట్లు దద్దరిల్లిపోతాయ్. అలాంటి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం మరి ఫ్యాన్స్ ఆ రేంజ్ లో ఎదురుచూడటంలో ఆశ్చర్యం ఏముంది ? పైగా నందమూరి అభిమాన సంఘ నాయకులు కొందరు మోక్షజ్ఞతో మొదటి నుంచి మంచి సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.
మరి వచ్చే ఏడాది మోక్షజ్ఞ తొలి చిత్రం ఉంటుందేమో. కాకపోతే దర్శకుడు ఎవరు అనేదే పెద్ద ప్రశ్న. క్రిష్ అయితే బాగుంటుంది అని బాలయ్య సన్నిహితులు సలహాలు ఇస్తున్నారు. పైగా క్రిష్ తో బాలయ్య గతంలో మూడు సినిమాలు చేశాడు.
శాతకర్ణితో ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్శ్ చేశాడు. క్రిష్ తో కూడా బాలయ్యకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే, తన కుమారుడి మొదటి సినిమాని క్రిష్ తో చేస్తేనే బెటర్ అని బాలయ్య కూడా అంగీకరించాడట. ప్రస్తుతం క్రిష్, పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు.
Also Read:Mahesh- Trivikram: మహేష్ కి మార్కెట్ లేదని భయపడుతున్న నిర్మాతలు