https://oktelugu.com/

Mokshagna Nandamuri: పాన్ ఇండియా డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినిమా.. బాలయ్య ఫ్యాన్స్ కి పండగే !

Mokshagna Nandamuri: నటసింహం బాలయ్య బాబు పేరు చెబితేనే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి, ఇక బాలయ్య డైలాగ్ లకు థియేటర్స్ డైనమెట్ పేలినట్లు దద్దరిల్లిపోతాయ్. అలాంటి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే, మోక్షజ్ఞ ఎంట్రీ పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో బాలయ్య కుమారుడి ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తోంది. సుజిత్ బాలయ్యకి వీరాభిమాని. అందుకే.. బాలయ్య కోసం ఓ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 25, 2022 / 06:17 PM IST

    Balakrishna Mokshagna

    Follow us on

    Mokshagna Nandamuri: నటసింహం బాలయ్య బాబు పేరు చెబితేనే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి, ఇక బాలయ్య డైలాగ్ లకు థియేటర్స్ డైనమెట్ పేలినట్లు దద్దరిల్లిపోతాయ్. అలాంటి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే, మోక్షజ్ఞ ఎంట్రీ పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో బాలయ్య కుమారుడి ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తోంది.

    Mokshagna Nandamuri

    సుజిత్ బాలయ్యకి వీరాభిమాని. అందుకే.. బాలయ్య కోసం ఓ కథ రాసుకుని వెళ్లి చెప్పాడట. అయితే.. కథ విన్న తర్వాత సుజిత్ టాలెంట్ పై నమ్మకం కుదరడంతో బాలయ్య తన కుమారుడి సినీ ఎంట్రీ బాధ్యతలను ఈ యంగ్ డైరెక్టర్ కి అప్పగించాడు. ఇది అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్. కెమెరా ముందుకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించని మోక్షజ్ఞతో సుజిత్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

    Sujit

    ఎలాగూ మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం పై చాలా ఏళ్లుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా సుజిత్ పేరు వినిపిస్తోంది. మరి ఈ ఏడాది మోక్షజ్ఞ తొలి చిత్రం ఉంటుందేమోనని నందమూరి అభిమానులు ఆశ పడుతున్నారు. కానీ ఆ మధ్య మోక్షజ్ఞకు నటన పై ఎలాంటి ఆసక్తి లేదని.. అందుకే తానూ సినిమాలకు దూరంగా ఉంటున్నాడని వార్తలు వచ్చాయి.

    కానీ బాలయ్య సన్నిహితుల చెబుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ తన మనసు మార్చుకుని.. సినిమాలు చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేసున్నాడట. వచ్చే సంక్రాంతికి సినిమాని లాంచ్ చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు. పైగా సుజిత్ పాన్ ఇండియా డైరెక్టర్. మంచి విషయం ఉన్న దర్శకుడు. ఏ రకంగా చూసుకున్న బాలయ్య కొడుక్కి ఇది మంచి సినిమానే అవుతుంది.

    Tags