https://oktelugu.com/

BrahmaAnandam Trailer : బ్రహ్మా ఆనందం’ ట్రైలర్ లో ‘బాబాయ్ హోటల్’ సినిమాలోని బ్రహ్మానందం కనిపించలేదా..? ఎందుకలా చేశారు..?

సినిమా ఇండస్ట్రీ లో నటించాలని ప్రతి ఒక్కరిలో ఒక చిన్న కోరికైతే ఉంటుంది. కానీ ఇక్కడ నటించి మెప్పించడం అనేది అంత ఆశామాషి వ్యవహారమైతే కాదు. కొన్ని లక్షల మంది యాక్టర్లుగా అవ్వాలని అనుకుంటే అందులో కొన్ని వేల ప్రయత్నం చేస్తే కేవలం కొందరికి మాత్రమే ఇక్కడ నటుడిగా చాలా మంచి గుర్తింపైతే లభిస్తుంది. తద్వారా వాళ్లు వాళ్ల నటనతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : February 10, 2025 / 08:57 PM IST
    Bramhanandam Trailer

    Bramhanandam Trailer

    Follow us on

    BrahmaAnandam Trailer : తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. దాదాపు 40 సంవత్సరాలుగా కమెడియన్ గా ఎనలేని గుర్తింపును అందుకుంటున్నాడు. ఈయన 1000 సినిమాలకు పైన నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా తన పేరును సుస్థిరం చేసుకున్నాడు…మరి ఇలాంటి నటుడు గత కొంతకాలం నుంచి సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చాడు… ఇక ఏజ్ రీత్యా చూసుకున్న ఆయన దాదాపు 70 ఇయర్స్ కి దగ్గరలో ఉన్నాడు. అందువల్లే ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయకుండా సెలెక్టెడ్ క్యారెక్టర్లను మాత్రమే చేస్తున్నాడు…ఇక తన కొడుకు అయిన ‘గౌతమ్ రాజా’ (Goutham Raja)తో కలిసి ‘బ్రహ్మా ఆనందం’ (Bramha Anandam) అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు…కొద్దిపాటి కామెడీ తో మరికొంత ఎమోషనల్ టచ్ ఇచ్చి మరి దర్శకుడు ఆర్ వి ఎస్ నిఖిల్ ఈ మూవీ ట్రైలర్ ను కట్ చేశాడు. ఇక ఈ ట్రైలర్ ను బట్టి చూస్తే ఈ సినిమాతో ఏదో ఒక మంచి మెసేజ్ అయితే ప్రేక్షకులకు చెప్పబోతున్నారు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడు కానీ ఒకప్పటి బ్రహ్మానందం అయితే కనిపించడం లేదు. జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన ‘బాబాయ్ హోటల్’ (Babai Hotel) సినిమాలోని బ్రహ్మానందం అటు కామెడీని, ఇటు ఎమోషనల్ సీన్స్ ని చాలా వరకు అద్భుతంగా పండించేవాడు.

    కానీ ఈ సినిమా ట్రైలర్ ని చూస్తే అందులో బ్రహ్మానందం పండించిన ఎమోషన్ సీన్స్ పెద్దగా కనెక్ట్ అయితే కావడం లేదు… గత రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘రంగ మార్తాండ’ సినిమాలో ఎమోషనల్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులందరి చేత ప్రశంసలను అందుకున్నాడు. కానీ ఈ బ్రహ్మా ఆనందం ట్రైలర్ లో మాత్రం బ్రహ్మానందం ఎమోషన్ పండించలేకపోయాడనేది తెలుస్తోంది.

    ఏజ్ అయిపోవడం వల్ల ఆయన అలా కనిపిస్తున్నాడా? లేదంటే క్యారెక్టర్ లోని డెప్త్ ని పట్టుకోవడంలో బ్రహ్మానందం ఫెయిల్ అయ్యాడా? అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి బ్రహ్మానందం ఒక పాత్ర వేస్తే అందులో ఆయన కనిపించడు ఆ క్యారెక్టర్ తాలూకు ఇంటెన్స్ అయితే కనిపిస్తుంది… కానీ ఈ సినిమా ట్రైలర్ లో బ్రహ్మానందం నటనలోని జీవమైతే కనిపించలేదు.

    ఆయన ఇక యాక్టింగ్ చేయలేననే ఇన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నాడేమో అనే అనుమానమైతే అందరిలో కలుగుతుంది… ఇక ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో అయిన ఆయన ఎమోషనల్ గా ప్రేక్షకుడిని కనెక్ట్ చేసి ఏడిపిస్తాడా లేదంటే సో సో గానే నటించి ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తాడా అనేది తెలియాల్సి ఉంది..