Mokshagna Debut Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే వాళ్ళలో నందమూరి తారక రామారావు ఒకరు… తెలుగు సినిమా ఖ్యాతిని దేశం నలుముల వ్యాపింపజేసిన ఘనత కూడా తనకే దక్కుతుంది. సినిమా హీరో గానే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా కూడా మారి ఎన్నో అభివృద్ధి పనులను చేశాడు. ఎంతో మంది పేదవాళ్ళకి అన్నం పెట్టాడనే చెప్పాలి. అలాంటి నందమూరి ఫ్యామిలీకి ఇటు సినిమా రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ చాలా గుర్తింపైతే ఉంది. మరి వాళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది నటులు హీరోలుగా రాణించాలనే ప్రయత్నం చేసినప్పటికి బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను మినహాయిస్తే మిగిలిన వారెవ్వరు కూడా ఆ ఫ్యామిలీ నుంచి హీరోలుగా నిలబడలేకపోయారు…
ఇక ప్రస్తుతం బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో బాలయ్య ఉన్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే కొడుకును ఇండస్ట్రీలో హీరోగా నిలబెడతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే మోక్షజ్ఞ హీరోగా ఒక సినిమా రిలీజ్ అవ్వాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి.
మొదట ప్రశాంత్ వర్మతో సినిమా అనుకున్నప్పటికి ప్రశాంత్ వర్మ వర్కౌట్ కాదని చెప్పడంతో ఇతర దర్శకుల వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మోక్షజ్ఞను ఏ డైరెక్టర్ పెర్ఫెక్ట్ గా ప్రెసెంట్ చేస్తాడు అనే ధోరణిలోనే ఇంకా ఆలోచిస్తున్నారట. మొత్తానికైతే మోక్షజ్ఞ ఎంట్రీ 2026వ సంవత్సరంలో ఉంటుందా? లేదా అనే విషయం మీద బాలయ్య బాబు సైతం ఎలాంటి క్లారిటి ఇవ్వలేకపోతున్నాడు…
ఇక నందమూరి అభిమానులు, టిడిపి పార్టీ కార్యకర్తలు సైతం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. మొత్తానికైతే మోక్షజ్ఞ హీరోగా సినిమాలు చేస్తాడా? సక్సెస్ అవుతాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి… ఒకవేళ తనకి ఇండస్ట్రీ కి రావడం ఇష్టం లేకపోతే బిజినెస్ లను చూసుకునే అవకాశాలున్నాయా? అనే దోరణిలో కూడా అభిమానులు ఆలోచిస్తున్నారు…