Anaganaga Oka Raju Collection Day 10: ఈ సంక్రాంతికి విడుదలైన 5 సినిమాల్లో కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) నటించిన ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) చిత్రం. విడుదలకు ముందే మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, సంక్రాంతి పండుగ సెలవుల్లో దుమ్ము దులిపేసింది. కానీ పండగ తర్వాత మాత్రం కలెక్షన్స్ బాగా డౌన్ అయ్యాయి. ఈ చిత్రానికి పండగ సమయంలో వచ్చిన కలెక్షన్స్ ని చూసి కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయని అనుకున్నారు. నిర్మాత నాగవంశీ వంద కోట్లు వచ్చినట్టు పోస్టర్లు కూడా గుద్దేసాడు కానీ, నిజానికి ఇప్పటి వరకు ఆ మార్కుని అందుకోలేదు. ఫుల్ రన్ లో అందుకోవడం కూడా అసాధ్యమే. ఈ పది రోజుల్లో ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , వర్కింగ్ డేస్ లో ఈ చిత్రం ఎంత డౌన్ అయ్యిందో అర్థం అవుతుంది.
రోజుల వారీగా వచ్చిన వసూళ్లు చూస్తే 8వ రోజున 90 లక్షలు, 9వ రోజున 60 లక్షలు, 10 వ రోజున 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లు చూస్తే నైజాం ప్రాంతం నుండి 10.60 కోట్లు, సీడెడ్ నుండి 3.38 కోట్లు, ఉత్తరాంధ్ర నుండి 6.04 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా నుండి 3.66 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 1.96 కోట్లు, గుంటూరు జిల్లా నుండి 2.25 కోట్లు, కృష్ణా జిల్లా నుండి 1.82 కోట్లు, నెల్లూరు నుండి 1.21 కోట్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఆంధ్రా, తెలంగాణ చూస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2.66 కోట్లు, ఓవర్సీస్ నుండి 8.34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 75.50 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నిర్మాతలు మొదటి వారం లోనే వంద కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్పుకొచ్చారు. కానీ క్లోజింగ్ లో కూడా దగ్గర్లోకి వెళ్లేలా కనిపించడం లేదు. పెద్ద హీరోలకు ఫేక్ పోస్టర్స్ వేయడం లో అర్థం ఉంది. అభిమానుల నుండి ఒత్తిడి కావొచ్చు, మరో ఇతర కారణాలు కూడా అయ్యుండొచ్చు. కానీ నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన నవీన్ పోలిశెట్టి లాంటి హీరోలకు కూడా ఎందుకు ఈ ఫేక్ పోస్టర్లు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకుల నుండి ఎదురు అవుతున్న ప్రశ్న.