Mokshagna Telugu Debut: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండేలాగా చూసుకుంటున్నాడు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు చాలా గొప్పవే అయినప్పటికి ఇకమీదట సాధించబోయే విజయాలతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు…ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా బాలయ్య బాబు చేసిన సినిమాలకు మాత్రం యూత్ లో మంచి ఫాలోయింగ్ అయితే ఏర్పడింది. ఆయన ఈ ఏజ్ లో కూడా మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ఇక బాలయ్య తన నటవారసుడిగా ఇండస్ట్రీకి మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పించాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి గత 8 సంవత్సరాలుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటూ అలసిపోయిన నందమూరి అభిమానులు సైతం ఇక ఆ విషయం గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు…
Also Read: ఓజీ vs అఖండ 2 పోటీలో వెనక్కి తగ్గిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
ఇక ఇప్పుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఇప్పటికే అతనికి 30 సంవత్సరాలు నిండిపోయాయి కాబట్టి ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి మరొక నాలుగు ఐదు సంవత్సరాలైతే ఈజీగా పడుతుంది. ఇక అప్పటివరకు 35 సంవత్సరాల వయసులోకి వస్తాడు.
ఇక అప్పుడు మోక్షజ్ఞ తనను తాను ఏమని ప్రూవ్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని సినిమాలు చేయగలుగుతాడు. ఇప్పటికే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఉంటే స్టార్ హీరో రేంజ్ లో కొనసాగుతూ మంచి సినిమాలను చేసే ఆస్కారం ఉండేది. అలాగే ఎక్కువ సినిమాలను చేయడానికి అవకాశం అయితే దొరికేది.
Also Read: మోక్షజ్ఞ కి పోటీగా వస్తున్న మరో సందమూరి కుర్రహీరో…పోటీలో గెలిచేది ఎవరు..?
కానీ ఆయన ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడంలో చాలా వరకు లేట్ చేశాడు. ఇక ఇప్పుడు ఆయన పెద్దగా ఇండస్ట్రీకి వచ్చి కూడా చేసేది ఏమీ లేదు అంటూ మరి కొంతమంది సినిమా విమర్శకులు సైతం అతని మీద విమర్శలైతే చేస్తున్నారు. మరి తను అందరికీ షాకిస్తూ ఒక్కసారిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగి తన స్టార్ డమ్ ను విస్తరించుకుంటూ ముందుకు సాగుతాడా? లేదంటే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదట్లోనే డీలా పడిపోతాడా అనేది తెలియాల్సి ఉంది…