Nandamuri Family Heroes: నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ వచ్చే సంవత్సరంలో ఉంటుందంటూ ప్రచారం సాగుతోంది. ఇక దానికి తోడుగా హరికృష్ణ కొడుకు అయిన జానకి రామ్ కారు యాక్సిడెంట్ లో మరణించిన విషయం మనకు తెలిసిందే…ఇక తన కొడుకు అయిన యంగ్ ఎన్టీఆర్ ని సైతం సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నారు… ఇక ఇప్పటికే ఈ బాధ్యతను ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన వైవిఎస్ చౌదరి తీసుకున్నాడు. నందమూరి ఫ్యామిలీ అంటే తనకి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. నందమూరి హరికృష్ణ కి ఆయన లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందించాడు. మరి అలాంటి హరికృష్ణ గారి మనవడిని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను కూడా తనే తీసుకోవడం విశేషం…ఇక ఇదిలా ఉంటే అటు మోక్షజ్ఞ, ఇటు యంగ్ ఎన్టీఆర్ ఒకేసారి ఇండస్ట్రీకి రాబోతున్నారు.
Also Read: ఓజీ vs అఖండ 2 పోటీలో వెనక్కి తగ్గిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
కాబట్టి వీరిలో ఎవరు సక్సెస్ అవుతారు ఎవరు ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయిపోతారు అనేది తెలియాల్సి ఉంది…ఇక మోక్షజ్ఞని జూనియర్ ఎన్టీఆర్ కి పోటీగా బాలకృష్ణ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ పాన్ ఇండియా హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు మోక్షజ్ఞ మాత్రం ఇంకా ఇండస్ట్రీకి ఎంట్రీనే ఇవ్వలేదు.
తనను తాను ప్రూవ్ చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ కి పోటీని ఇవ్వాలంటే మాత్రం మరింత సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఇదంతా చూస్తున్న మరి కొంతమంది సినిమా విమర్శకులు సైతం జూనియర్ ఎన్టీఆర్ దాకా ఎందుకు కొత్తగా వస్తున్న హరికృష్ణ మనవడు అయిన కొత్త ఎన్టీఆర్ కి పోటీని ఇచ్చే విధంగా అయిన మోక్షజ్ఞ తయారవుతాడా? లేదా అనేది అనేది ఒకసారి చూసుకోండి అంటూ బాలయ్య బాబును హెచ్చరిస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా నందమూరి అభిమానులందరు ఆనందంగా ఉండాలంటే వచ్చిన హీరోలందరు కూడా సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక అలాగే ఈ ఫ్యామిలీ హీరోలందరు కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని సగటు ప్రేక్షకులంతా ఆసక్తి గా ఉండడం విశేషం… మరి ఇప్పటివరకు బాలయ్య బాబు – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అయితే రాలేదు. మరి ఇప్పుడున్న ఈ కొత్త జనరేషన్ లో అయిన నందమూరి ఫ్యామిలీ హీరోలు కలిసి సినిమాలను చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలియాల్సి ఉంది…