Homeఎంటర్టైన్మెంట్మలయాళ సూపర్ స్టార్ నోట తెలుగు మాట !

మలయాళ సూపర్ స్టార్ నోట తెలుగు మాట !

పరభాషా సూపర్ స్టార్ సినిమా టీజర్ లో తెలుగు డైలాగ్ ఉండటం అంటే.. కాస్త ఆలోచించాల్సిందే. ఇంతకీ ఎవరు ఆ సూపర్ స్టార్ అంటే.. మలయాళ సూపర్ స్టార్ ‘మోహన్ లాల్’. ఇప్పటికే తెలుగులో మోహన్ లాల్ కు మంచి పాపులారిటీ ఉంది. ‘జనతా గ్యారేజ్’ సినిమాతో మోహన్ లాల్ సినిమాలకు తెలుగులో కూడా క్రేజ్ పెరిగిందనేది వాస్తవం. ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ తో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్ – మోహన్ […]

Aarattu Teaserపరభాషా సూపర్ స్టార్ సినిమా టీజర్ లో తెలుగు డైలాగ్ ఉండటం అంటే.. కాస్త ఆలోచించాల్సిందే. ఇంతకీ ఎవరు ఆ సూపర్ స్టార్ అంటే.. మలయాళ సూపర్ స్టార్ ‘మోహన్ లాల్’. ఇప్పటికే తెలుగులో మోహన్ లాల్ కు మంచి పాపులారిటీ ఉంది. ‘జనతా గ్యారేజ్’ సినిమాతో మోహన్ లాల్ సినిమాలకు తెలుగులో కూడా క్రేజ్ పెరిగిందనేది వాస్తవం. ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ తో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్ – మోహన్ లాల్ ఇద్దరూ పోటీ పడి నటించడం మొత్తానికి తెలుగు వాళ్లకు ఆ ఒక్క సినిమాతోనే మోహన్ లాల్ ను బాగా దగ్గర చేసింది.

కాగా మోహన్ లాల్ తాజాగా నటిస్తోన్న కొత్త సినిమా “ఆరాట్టు”. ఈ సినిమా పై మలయాళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ మలయాళ సినిమా టీజర్ విడుదలయింది. ఉన్నికృష్ణన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా, పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా… ఫుల్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రానుంది. ఇక మోహన్ లాల్ పక్కా మాస్ పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యక విశేషం ఏమిటంటే.. ఈ “ఆరాట్టు” టీజర్ లో ఒకే ఒక్క తెలుగు డైలాగ్ ఉండడం. “నేను వాడిని చంపేస్తా” అంటూ మోహన్ లాల్ తెలుగులో డైలాగ్ చెప్పారు.

ఈ డైలాగే ఇప్పుడు మలయాళ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ డైలాగ్ కి వారు అర్ధం తెలుసుకుంటున్నారు. ఇంతకీ మలయాళ భారీ సినిమా నుండి వచ్చిన క్రేజీ టీజర్ లో ఒక్క డైలాగ్ ఉండటం ఏమిటి.. పైగా ఉన్న ఆ ఒక్క డైలాగ్ కూడా తెలుగులో ఉండటం ఏమిటి ? కాగా ఈ సినిమాలో మోహన్ లాల్ తెలుగు వ్యక్తి అట. ఇక ఈ టీజర్ లో తెలుగు డైలాగ్ చూసి మన తెలుగు వాళ్ళు కూడా ఈ టీజర్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper