Mohan Babu in The Paradise Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాని లాంటి హీరో చాలా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు…మరి ఇలాంటి సందర్భంలో నాని లాంటి హీరో ప్యారడైజ్ (Paradise) సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఆ పాత్రకు తగ్గట్టుగానే ఆయన హావభావాలు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే ఆయన ఒక ఏరియా కి డాన్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన పాత్ర కూడా ఈ సినిమాలో చాలా కీలకంగా మారబోతుందట. హీరోకి తనకు మధ్య ఉన్న కొన్ని గొడవల వల్ల ఇద్దరి మధ్య మొదట శత్రుత్వం ఉండి ఆ తర్వాత మళ్లీ మిత్రులుగా మారిపోతారట. మరి మోహన్ బాబు లాంటి నటుడు ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ పాత్ర చాలా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఆయన చేసిన సినిమాలన్నింటిలో తన బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తు గత 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీ సేవలు అందిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా తన పాత్రకి న్యాయం చేస్తాడని దర్శకుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
మరి ప్రస్తుతం కన్నప్ప సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు. మరి ఇక మీదట కూడా ఆయన ఇతరుల సినిమాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
Also Read: HHVM movie story: ‘హరి హర వీరమల్లు’ కు నిజాం రాజుకు ఏంటి సంబంధం..? చార్మినార్ కథలో ఎందుకు ఉంది?
మోహన్ బాబు సైతం ప్యారడైజ్ సినిమాలో క్యారెక్టర్ ఒప్పుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆ పాత్ర తనకు చాలా కొత్తగా అనిపించిందట. ఇప్పటివరకు ఎప్పుడు తను చేయనటువంటి ఒక గొప్ప పాత్ర కావడం వల్లే ఆయన ఆ సినిమాలో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే మోహన్ బాబు మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఇక నాని మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలను నెక్స్ట్ షెడ్యూల్లో తెరకెక్కించే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ప్యారడైజ్ సినిమా మీద ప్రతి ఒక్కరికి చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి…