Lakshmi Manchu: వయసుతో సంబంధం లేకుండా లైఫ్ ని ఆస్వాదిస్తోంది మంచు లక్ష్మి. ఆమెను ఆడియన్స్ హీరోయిన్ గా అంగీకరించకున్నా ఇంకా అలానే ఫీల్ అవుతుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ పరువాల ప్రదర్శన చేస్తుంది. తాజాగా డిజైనర్ శారీలో కిరాక్ ఫోజుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. పైట పక్కకు జరిపి ఎద అందాల విందు చేసింది. మంచు లక్ష్మి లుక్ టెంప్ట్ చేసేలా ఉంది. నెటిజెన్స్ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో అగ్ని నక్షత్రం టైటిల్ తో మూవీ తెరకెక్కింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నట్లు సమాచారం. విడుదలకు సిద్ధం చేయాల్సి ఉండగా ఎలాంటి అప్డేట్ లేదు. అగ్ని నక్షత్రం మూవీకి మంచు లక్ష్మినే నిర్మాత. తండ్రి మోహన్ బాబు సైతం ఓ కీలక రోల్ చేశారు. ఈ మూవీలో మంచు లక్ష్మి యాక్షన్ ఇరగదీస్తుంది. ఇందులో ఆమె పోలీస్ గా నటించే అవకాశం కలదు.
గతంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో గుండెల్లో గోదారి, లక్ష్మీ బాంబ్, దొంగాట వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఒక్కటి కూడా మంచు లక్ష్మికి బ్రేక్ ఇవ్వలేదు. అయినా పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తుంది. మోహన్ బాబు ముగ్గురు పిల్లలు పరిశ్రమలో సక్సెస్ కాలేకపోయారు. కాగా మంచు ఫ్యామిలీలో విబేధాలు కొనసాగుతున్నాయి. మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య సఖ్యత లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటున్నారు. కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
ఇటీవల మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్ళికి విష్ణు దూరంగా ఉన్నారు. మంచు లక్ష్మి తమ్ముడు వివాహం అన్నీ తానై పూర్తి చేసింది. మంచు లక్ష్మి నివాసంలో మనోజ్-భూమా మౌనికల వివాహం మూడు రోజులు జరిగింది. మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం విష్ణు, మోహన్ బాబులకు ఇష్టం లేదనే వాదన ఉంది. అలాగే ఆస్తుల పంపకాల విషయంలో కూడా గొడవలు జరిగాయని అంటున్నారు. మంచు ఫ్యామిలీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న శ్రీ విద్యానికేతన్ బాధ్యతలు మోహన్ బాబు విష్ణుకు అప్పగించారు.