Mohan Babu : గత వారం రోజుల నుండి అల్లు అర్జున్ తో పాటు మంచు కుటుంబం కూడా నేషనల్ వైడ్ గా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఆస్తుల పంపకం విషయంలో మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు, విష్ణులపై తిరుగుబాటు చేయడం, విష్ణు లేని సమయంలో మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవలు జరగడం, ఇరువురు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసులు వేసుకోవడం వంటివి జరిగాయి. ఇంట్లో సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను పబ్లిక్ లో పెట్టినప్పుడు కచ్చితంగా మీడియా ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం చెప్పాలి, కానీ మోహన్ బాబు మీడియా పై దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మోహన్ బాబు అరెస్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. నిన్ననే ఆయన దాడి చేసిన విలేఖరిని కలిసి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు.
ఇది ఇలా ఉండగా నేడు మోహన్ బాబు చంద్ర గిరి పోలీస్ స్టేషన్ పీఆర్వో చేత తన డబుల్ బ్యారెల్ గన్ ని సరెండర్ చేయించాడు. కుటుంబం లో పరస్పరం గొడవలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు కేసులు వేసుకునే స్థాయికి వచ్చేసారు. ఈ క్రమం లో క్షణికావేశంలో ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. అందుకే పోలీసులు వెంటనే గన్ ని సరెండర్ చెయ్యాలని, లేకపోతే వారెంట్ ని జారీ చేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన తన వద్ద ఉన్న డబుల్ బ్యారెల్ గన్ ని ఇచ్చేసాడు. మళ్ళీ తిరిగి తీసుకుంటాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇదంతా పక్కన పెడితే నిన్న మంచు మనోజ్ తన అన్నయ్య విష్ణు పై కేసు వేసిన ఘటన మరోసారి సంచలనం గా మారింది. తన ఇంటి జనరేటర్ లో మా అన్నయ్య విష్ణు పంచదార వేసాడని, అందువల్ల మా ఇంటికి విద్యుత్తు సరఫరా ఆగిపోయిందని చెప్పుకొచ్చాడు.
దానికి సంబంధించిన సీసీటీవీ కెమెరా వీడియోలను కూడా ఆయన పోలీసులకు సమర్పించాడు. ఇదంతా పక్కన పెడితే నేడు తన భార్య భూమా మౌనిక తల్లి జన్మదినం అవ్వడంతో మనోజ్ ఆళ్లగడ్డ కి వెళ్లి, భూమా శోభా కి నివాళ్లు అర్పించి, తన అక్క భూమా అఖిల ప్రియ ఇంటికి వెళ్లారు. ఈరోజు ఉదయం నుండి మంచు మనోజ్ దంపతులు జనసేన పార్టీ లో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా లో దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు పలు ఫన్నీ ట్రోల్ల్స్ చేస్తున్నారు. మీ పార్టీ ఆఫీస్ లో జనరేటర్ జాగ్రత్త అన్నా, అక్కడికి మంచు విష్ణు వచ్చి జనరేటర్ షుగర్ పోస్తాడు అని కామెడీ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం మనోజ్ వస్తున్నాడు అనే వార్త విని ఆయనకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుంది.