https://oktelugu.com/

Mohan Babu Son Of India: ప్చ్.. కలెక్షన్‌ కింగ్‌ సినిమా కలెక్షన్లు వందల్లోనే !

Mohan Babu Son Of India: మోహన్‌ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ‘సన్నాఫ్‌ ఇండియా’ విడుదలకు ముందే నిరాశను కలిగించింది. ఈ సినిమా ఈ రోజు విడుదలవుతుండగా బుక్‌ మై షోలో సినీ అభిమానుల తాకిడి అంతగా లేకపోవడం మంచు ఫ్యామిలీని బాగా ఇబ్బంది పెడుతుంది. చాలా చోట్ల ఒక్కరు కూడా టికెట్ బుక్‌ చేసుకోకపోగా, కొన్ని చోట్ల సింగిల్‌ డిజిట్‌ ఉంటున్నాయి. ఈ లెక్కన కలెక్షన్‌ కింగ్‌ సినిమా కలెక్షన్లు వందల్లోనే ఉండబోతున్నట్టు ట్రేడ్‌ […]

Written By:
  • Shiva
  • , Updated On : February 18, 2022 / 10:38 AM IST
    Follow us on

    Mohan Babu Son Of India: మోహన్‌ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ‘సన్నాఫ్‌ ఇండియా’ విడుదలకు ముందే నిరాశను కలిగించింది. ఈ సినిమా ఈ రోజు విడుదలవుతుండగా బుక్‌ మై షోలో సినీ అభిమానుల తాకిడి అంతగా లేకపోవడం మంచు ఫ్యామిలీని బాగా ఇబ్బంది పెడుతుంది. చాలా చోట్ల ఒక్కరు కూడా టికెట్ బుక్‌ చేసుకోకపోగా, కొన్ని చోట్ల సింగిల్‌ డిజిట్‌ ఉంటున్నాయి.

    Mohan Babu Son Of India

    ఈ లెక్కన కలెక్షన్‌ కింగ్‌ సినిమా కలెక్షన్లు వందల్లోనే ఉండబోతున్నట్టు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. చిరు వాయిస్‌ ఓవర్‌ చెప్పినా క్రేజ్‌ రాలేదు. మరోపక్క నిరాశ కలిగిస్తున్న ‘సన్నాఫ్‌ ఇండియా’ అంటూ ట్రోలర్స్ ఈ సినిమా పై దాడికి దిగారు. ఇక సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తోన్న ట్రోలింగ్ ప‌ట్ల సినీ న‌టుడు మోహ‌న్ బాబు స్పందించిన సంగతి తెలిసిందే.

    Mohan Babu Son Of India

    మోహన్ బాబు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ… ట్రోలింగ్‌, మీమ్స్‌ చూసి చాలా బాధపడుతున్నాన‌ని చెప్పారు. వాటిని ప‌ట్టించుకోవాల్సిన‌ అవసరం లేదని.. కానీ, ఆత్మాభిమానం ఉంటుంది కాబ‌ట్టి బాధపడక తప్పదని చెప్పుకొచ్చారు. వ్యంగ్య ధోరణి ఇబ్బందికరంగా ఉంటుందని, మామూలుగా వాటిని చూడనని, ఎవరన్నా పంపిస్తేనే చూస్తానని చెప్పారు మోహన్ బాబు.

    Also Read: Mohan Babu Son of India Movie Review : ‘సన్నాఫ్ ఇండియా’ మూవీ రివ్యూ.. మోహన్ బాబు ఫసక్ అనిపించాడా లేదా?

    మొత్తానికి ట్రోలింగ్ పై అసహనం వ్యక్తం చేసిన మోహన్ బాబు.. ఇద్దరు హీరోలు కొంతమందిని అపాయింట్ చేసుకుని ఇలా చేస్తున్నారని కూడా విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ధి… చెప్పిన వాడిని, చేసిన వాడిని ప్రకృతి చూస్తోంది. వాళ్ళు ఇప్పటికి బాగానే ఉండొచ్చు.. కానీ ఎదో ఒకరోజు వాళ్లకు శిక్ష తప్పదు… మీమ్స్ అనేవి సరదాగా నవ్వుకునేలా ఉండాలి… కాని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు.

    Also Read: ‘Son of India’ Movie Collections : ‘సన్నాఫ్ ఇండియా’ తొలి రోజు కలెక్షన్లు షాకింగ్.. ఎంతో తెలిస్తే ఫసక్కే

    మరి మోహన్ బాబు చెప్పినట్టు ఎవరో ఇద్దరు హీరోలు ఇదంతా చేయిస్తోంది నిజమే అనుకుంటే.. ఇన్నాళ్లు మోహన్ బాబు ఏమి చేస్తునట్టు ? ఎందుకంటే.. మంచు ఫ్యామిలీని గత కొన్నేళ్లుగా అనేక రకాలుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. మోహన్ బాబు ఎన్నడూ ఆ ఇద్దరి హీరోల పై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు చేసినట్లు ? బహుశా ఆయన తన సినిమాకి వస్తున్న కలెక్షన్స్ పట్ల పూర్తి అసంతృప్తిగా ఉన్నారు.
    Also Read:
    1. సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు
    2. ‘భీమ్లా నాయక్’ మూవీ ఫస్ట్ రివ్యూ..

    Tags