Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ ఇండియా. చాలా రోజుల తర్వాత మోహన్ బాబు ఫుల్ లెంత్ రోల్లో వస్తున్న యాక్షన్ కమ్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. ఇందులో మోహన్ బాబు చాలా పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. డైమండ్ రత్నబాబు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 18న రిలీజ్ కాబోతోంది. కాగా దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు మూవీ టీమ్.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ తన సినీ జీవితం గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. తాను జీవితంలో రిస్క్ తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపుతానన్నారు. జీవితంలో ఎన్నో సార్లు రిస్క్ చేసి సినిమాలు తీశానని, కొన్ని సార్లు ఇల్లు అమ్మేసే పరిస్థితుల్లో కూడా మూవీ నిర్మించానన్నారు. తాను సినిమాల్లో సంపాదించన డబ్బు విద్యాలయాల్లో పెట్టినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: మహేష్ ‘కళావతి’ పైరసీకి గురి అయ్యింది !
తాను ఒకప్పుడు చిన్నగా స్థాపించిన విద్యాలయాలు ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయన్నారు. 35 ఏండ్లుగా కష్టపడితే ఇది సాధ్యం అయిందన్నారు. తన పిల్లలకు కూడా సినిమానే ఊపిరి అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. సన్ ఆప్ ఇండియా మూవీని డైమండ్ రత్నబాబు తనుకు చెప్పగానే ఎంతో నచ్చిందని అందుకే ఓకె చెప్పినట్టు స్పష్టం చేశారు.

ఈ మూవీ గురించి విష్ణును అడిగినప్పుడు తను నో చెప్పి ఉంటే ఓకే చేసేవాడిని కాదన్నారు. ఎందుకంటే ప్రతి సినిమా విషయంలో ఆలోచిద్దాం నాన్న అనేవాడని, కానీ ఈ ఒక్క సినిమా విషయంలో మాత్రం టైటిల్ లోగో రెడీ చేసి పంపించాడని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని, కాబట్టి థియేటర్లకు వెళ్లి చూడాలని కోరారు మోహన్ బాబు.
Also Read: సీపీఐ నేత నారాయణ, దేవులపల్లి అమర్ మధ్య విద్వేషాలకు కారణాలేంటి?
[…] […]
[…] […]