Mohan Babu: సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు విలక్షణ నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మోహన్ బాబు తన ఎంటైర్ కెరీర్ లో 500కు పైన సినిమాలను చేశాడు… విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత కామెడీ విలన్ గా అవతరించాడు. ఇక ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆయన హీరో గా చేసిన చాలా సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో హీరోగా చాలా కాలం పాటు సాగిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలను చేస్తున్నాడు… ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అవుతున్న వేల రీసెంట్ గా ఆయన ఒక ఈవెంట్ ను కూడా కండక్ట్ చేశాడు. ఇందులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు తన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే హీరోగా చాలా పెద్ద స్థాయికి వెళ్లాల్సిన మోహన్ బాబు ఒక స్థాయి వరకే ఎందుకు పరిమితమయ్యాడు అనేది కూడా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్న అనే చెప్పాలి. ముఖ్యంగా మోహన్ బాబు తన దర్శకులతో చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాడట. అందువల్లే అతనితో సినిమాలు చేయడానికి చాలామంది డైరెక్టర్స్ భయపడిపోయేవారట. అందుకే అతనితో సినిమా చేయలేదని టాప్ డైరెక్టర్ ఆయన్ని పట్టించుకోకపోవడం వల్లే ఆయన టాప్ హీరోగా మారలేకపోయారని ఇప్పటికి ఇండస్ట్రీ లో ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. అప్పట్లో రాఘవేంద్ర రావు సౌందర్యలహరి అనే ఒక ప్రోగ్రాం చేశాడు.
అందులో రాఘవేంద్ర రావు సినిమాల గురించి మాట్లాడటం చేశారు. అందుకే తనతో సినిమాలు చేసిన హీరోలను, హీరోయిన్లను తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేసిన వారిని పిలిపించుకొని వాళ్ళతో ఆనాటి విషయాలను గుర్తు చేసుకొని వాటికి సంబంధించిన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
ఇక అందులో రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన కోదండరామిరెడ్డి వచ్చాడు. అప్పటికే మోహన్ బాబు అక్కడే ఉండి కోదండరామిరెడ్డి ని కొన్ని బూతులు తిట్టాడు. అతన్ని అరేయ్ అంటూ సంబోధిస్తూ అప్పట్లో నాతో ఒక్క సినిమా చేయమంటే చేయలేదు రా నువ్వు అని అతన్ని బెదిరించాడు. దాంతో కోదండరామిరెడ్డి సైతం సీనియర్ ఎన్టీఆర్ తో అవకాశం వస్తేనే నేను సినిమాని చేయలేదు నేను ఇప్పుడు అంత బిజీగా ఉన్నాను.
అందువల్ల మీతో కూడా చేయలేదు కానీ ఆ తర్వాత మీతో సినిమా చేశాను అంటూ మోహన్ బాబు తో చెప్పడంతో ఆయన కొంతవరకు కూల్ అయ్యాడు. మొత్తానికైతే మోహన్ బాబు కి కోపం వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఆ ఒక ఈవెంట్లో చూపించాడు. మొత్తానికైతే ప్రస్తుతం మోహన్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరోసారి తన లక్ ను పరీక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది…