Vijaya Sai Reddy: పవన్ కళ్యాణ్ ను( Pawan Kalyan) నేను గతంలో ఏమీ అనలేదని చెప్పారు విజయసాయిరెడ్డి. ఇకముందు ఆయనను విమర్శించని కూడా చెప్పుకొచ్చారు. అయితే అది అవసరార్థం చేసిన వ్యాఖ్య అని తెలుస్తోంది. జగన్ కోటరీ పై మాట్లాడడంతో విజయసాయిరెడ్డి పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. నమ్మకద్రోహం అంటూ ఎక్కువ మంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అదే సమయంలో జనసైనికులు సైతం గతంలో విజయసాయిరెడ్డి వ్యవహార శైలిని బయట పెడుతున్నారు. గతంలో ఆయన చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తున్నారు.
* సోషల్ మీడియాకు పని.. విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా వ్యవహరించారు. జగన్ తరువాత అతనే అన్నట్టు నడిచింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో. ఆ సమయంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. అప్పట్లో చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడేవారు. అటు తరువాత అంత తీవ్ర పదజాలం వాడేది పవన్ కళ్యాణ్ పైనే. బిజెపి నేతలు పురందేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి పై కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. రామోజీరావు తో పాటు వేమూరి రాధాకృష్ణపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. వీరంతా విజయసాయిరెడ్డి బాధితులే. కానీ నేనెప్పుడూ పవన్ ను ఒక్క మాట కూడా అనలేదని విజయసాయిరెడ్డి తాజాగా వ్యాఖ్యానిస్తుండడాన్ని తప్పుపడుతున్నారు జనసైనికులు. ఏం అవసరం మేరకు ఇలా మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఇదిగో మీరు చేసిన వ్యాఖ్యలు అంటూ సోషల్ మీడియాలో పాత పోస్టులు తీసి పెడుతుండడం విశేషం.
* అప్పట్లో చాలా చులకనగా..
చంద్రబాబుపై( CM Chandrababu) విజయసాయిరెడ్డి చేసిన ప్రతి వ్యాఖ్యలు పవన్ ను ఉద్దేశించి చాలా కామెంట్స్ చేశారు. చులకనగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. జనసేన ఒక ఫెయిల్యూర్ పార్టీగా అభివర్ణించే క్రమంలో పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడిన పరిస్థితి ఉంది. పార్ట్నర్, పావలా, పెళ్లిళ్లు అంటూ చాలా హీనంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎందుకో ఇప్పుడు విజయసాయిరెడ్డి తాను పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని చెబుతుండడం వెనుక ఏం జరిగి ఉంటుందా అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే విజయ్ సాయి రెడ్డి వ్యవహార శైలి పై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. జగన్ ఆయనతో అలా మాట్లాడిస్తున్నారని.. కూటమిలో విభేదాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఒక అనుమానం. దానికి తగ్గట్టుగానే ఎవరికీ అనుమానం రాకుండా అటు జగన్ కోటరీ పై మాట్లాడుతునే.. ఇటు పవన్ కళ్యాణ్ కు దగ్గరగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతకుమించి ఏమీ లేదని జనసేన శ్రేణులు తేల్చి చెబుతున్నాయి.