https://oktelugu.com/

Mohan babu: అప్పుడు నేను లోకేశ్​కు వ్యతిరేకమైనా.. ఇప్పుడు బాలయ్య మాకు అండగా ఉన్నారు: మోహన్​ బాబు

మా ఎన్నికల్లో నటుడు మోహన్​బాబు తనయుడు మంచు విష్ణు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు మోహన్​బాబు. గత సార్వత్రిక ఎన్నికత్లో లోకేశ్​ ఓటమికి ప్రచారం చేసినప్పటికీ.. నందమూరి బాలకృష్ణ తన కొడుకుకు మద్దతుగా నిలిచారని అన్నారు. మనసులో గతాన్ని పెట్టుకోకుండా మంచి వ్యక్తిగా వ్యవహరించారని తెలిపారు. జరిగిన ‘మా’ ఎన్నికల్లో బాలయ్య తన తనయుడు విష్ణుకి మద్దతుగా ఉండి.. గెలిపించడం హర్హనీయమని అన్నారు మోహన్​ బాబు. ఈ క్రమంలోనే […]

Written By: , Updated On : October 14, 2021 / 03:56 PM IST
mohan-babu-mohan-babu-comments-on-balakrishna-about-maa-elections
Follow us on

మా ఎన్నికల్లో నటుడు మోహన్​బాబు తనయుడు మంచు విష్ణు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు మోహన్​బాబు. గత సార్వత్రిక ఎన్నికత్లో లోకేశ్​ ఓటమికి ప్రచారం చేసినప్పటికీ.. నందమూరి బాలకృష్ణ తన కొడుకుకు మద్దతుగా నిలిచారని అన్నారు. మనసులో గతాన్ని పెట్టుకోకుండా మంచి వ్యక్తిగా వ్యవహరించారని తెలిపారు. జరిగిన ‘మా’ ఎన్నికల్లో బాలయ్య తన తనయుడు విష్ణుకి మద్దతుగా ఉండి.. గెలిపించడం హర్హనీయమని అన్నారు మోహన్​ బాబు.

ఈ క్రమంలోనే తాజాగా ఆయన విష్ణుతో కలిసి బాలకృష్ణను కలిశారు. సినీ పరిశ్రమలోని ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. 16వ తేదీ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకార కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని బాలయ్యని కోరినట్లు మోహన్​బాబు తెలిపారు. మా భవన నిర్మాణంలోనూ విష్ణుకు తోడుగా ఉంటానని చెప్పినట్లు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా ఓటమి అనంతరం ప్యానెల్​ సభ్యులతో కలిసి చర్చించిన ప్రకాశ్​ రాజ్​.. భవిష్యత్‌లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)లో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగడం కోసం తమ 11 మంది ప్యానెల్ సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చిత్ర పరిశ్రమతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో ‘మా’ ఎన్నికలను చూసి ఆశ్చర్యపోయారని అన్నారు.   ఇక పోలింగ్‌, కౌంటింగ్‌ సందర్భంగా మోహన్‌బాబు వ్యవహరించిన తీరునూ ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే బెనర్జీ, శ్రీకాంత్​, తనీశ్​ తదితర ప్యానెల్​ సభ్యులు ఎన్నికల్లో జరిగిన అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ప్రకాశ్​రాజ్​ మరో అసోసియేషన్​ పెడతారని వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. అవన్నీ కేవలం పుకార్లని అటువంటి ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.